వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

భూ పరిపాలన నుంచి మినహాయింపు ఇవ్వండి..

November 6, 2019

అబ్దుల్లాపూర్‌ ‌మెట్‌ ‌తహశీల్దార్‌ ‌విజయారెడ్డి సజీవ దహనం నుంచి రెవెన్యూ ఉద్యోగులు కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. ఈ ఘటన రెవెన్యూ సమాజాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. చివరకు తహసీల్దార్‌ను కాపాడపోయిన డ్రైవర్‌ ‌గురునాధం బలయైపోయాడు. ఈ ఘటనకు ప్రధాన కారణం భూమి సమస్యనే. రెవెన్యూ అధికారిగా, రెవెన్యూ యంత్రాంగం పరిష్కారించడానికి వీలులేని సున్నితమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. రెవెన్యూ యంత్రాంగం పడుతున్న ఇబ్బందులు, నిత్యం ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఇతర సమస్యలకు ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపడం లేదు. ఇదే కాకుండా సకాలంలో ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు తొలిగించేందుకు ఎలాంటి ప్రయత్నం జరగడం లేదు. మెరుగైన భూపరిపాలన కోసం తక్షణ చర్యలు అవసరం. అలా జరగకపోతే, రైతుల కష్టాలు తీరవు. రెవెన్యూ ఉద్యోగుల ఇక్కట్లు తొలగవు.
భూ పరిపాలన పనులు మాకొద్దు రెవెన్యూ శాఖకు ఒకప్పుడు రెవెన్యూ వసూలుతో పాటు భూ పరిపాలనానే కీలకంగా ఉండేది. కానీ ఇప్పుడు భూ పరిపాలనా తోకంత అయి మిగతా పనులు ఎక్కువ అయ్యాయి. ప్రొటోకాల్‌ ‌నుంచి మొదలై సంక్షేమ పథకాల అమలు వరకూ రెవెన్యూ ఉద్యోగులమే చేయాల్సి వస్తుంది. అంతిమంగా రెవెన్యూ పనులలో కీలకమైన భూ పరిపాలనాకు సమయం ఇవ్వలేని పరిస్థితి. దీనికి తోడు లోపభూయిష్టమైన అనేక అంశాలు ఉన్నాయి. వీటితో రైతులకు సకాలంలో సేవలు అందించలేని పరిస్థితి ఏర్పడింది. రెవెన్యూ ఉద్యోగులకు దీని కారణంగానే చెడ్డ పేరును మూట కట్టుకోవాల్సి వస్తుంది. అదే భూ పరిపాలనా లేకుండా ఉంటే ఎలాంటి నిందలు పడవు. ఇతర ఏ సాధారణ పరిపాలనా ఇచ్చిన గౌరవంగా చేసుకోవచ్చు. అందుకే మా నుంచి భూ పరిపాలనా నుంచి మినహాయింపు కోరుతున్నాం.
దీనికి ప్రధాన కారణాలు భూమి రికార్డు భూమి పై హక్కుల నిరూపణకు పూర్తి సాక్ష్యం కాదు…భూమి రికార్డునైన ఎప్పుడైనా సవరించవచ్చు…భూ రికార్డులలోని వివరాలకు భరోసా లేదు…భూమి హద్దులు తెలిపే పటాలు లేవు. ఉన్న భూములకు హద్దు రాళ్లు లేవు…ఏ భూమి సమస్యకు ఎవరి దగ్గరకు ఏవిధంగా వెళ్ళాలి, ఎంతకాలంలో పరిష్కరించాలి అనే విషయాలపై స్పష్టత లేదు…లెక్కకు మిక్కిలి భూమి చట్టాలు, నియమాలు, ప్రభుత్వ ఉత్తర్వులు. చట్టాలలో గందరగోళం… 40 ఏళ్లకు ఒకసారి జరగాల్సిన భూముల సర్వే 80 ఏళ్ళైన దిక్కులేదు…అసంపూర్ణంగా మిగిలిన చారిత్రక భూ చట్టాల (సీలింగ్‌, ‌టెనెన్సీ, ఇనాం) అమలు. వాస్తవ పరిస్థితికి అద్దం పట్టని భూ రికార్డులు…భూ పరిపాలనకు తగిన సమయం ఇవ్వలేని రెవెన్యూ శాఖ. చట్టాలు, నియమాలపై శిక్షణ కరువు… జమాబందీ, అజమాయిషీ ఆగిపోయింది…సివిల్‌ ‌కోర్టులలో 66% కేసులు భూ తగాదాలే.
భూ సమస్యలు పరిష్కారం కావాలంటే.. 1. సమగ్ర భూ సర్వే జరగాలి. 2. భూచట్టలను సమీక్షించి ఓక సమగ్ర రెవిన్యూ కోడ్‌ను రూపొందించాలి. 3. టైటిల్‌ ‌గారంటీ చట్టం తేవాలి. 4. భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్‌లను ఏర్పాటు చెయ్యాలి. 5. ప్రజల భాగస్వామ్యంతో భూరికార్డుల సవరణ చేయాలి. కావాల్సినంత గడవు ఇవ్వాలి.

– తెలంగాణ రెవెన్యూ జేఏసీ