నేడు జరగనున్న రెండవ విడుత ప్రాదేశిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని జెడ్పీటీసీలు, ఎంపీటీసీల ఎన్నికలు సజావుగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో . వారు మాట్లాడుతూ జిల్లాలో రెండవ విడతల్లో 5 మండలాల్లోని 5 జడ్పీటీసీలకుగాను 32 మంది పోటీలో ఉన్నారని, అదేవిధంగా 61 ఎంపీటీసీలకు గాను 8 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అవ్వగా మిగిలిన 53 ఎంపీటీసీ లకు 192 మంది పోటీలో ఉన్నారని కలెక్టర్ తెలిపా రు. రెండవ విడతలో ఒక లక్ష 53 వేల 863 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగిం చుకొనుటకు 391 పోలింగ్ కేంద్రా లను ఏర్పా టు చేయడం జరిగిందని, 391 బ్యాలెట్ బాక్సు లను వినియోగిస్తున్నట్లు, ఎన్నికల నిర్వహణకు 1836 మంది అధికారులను నియమించామని అందులో 391 పిసైడింగ్, 391 సహాయ పి సైడింగ్ అధికారులను, 1198 ఇతర పోలింగ్ అధికారులు ఉన్నట్లు తెలిపారు. రెండవ విడతలో 10 గ్రామాల్లోనీ సమస్యా త్మకమైన 40 పోలింగ్ కేంద్రాలకు 13 మంది మైక్రో అబ్జర్వర్ తో పాటు అధిక పోలీసు బలగా లను నియమించి పోలింగ్ ప్రక్రియను మొత్తం వీడియోగ్రఫీ చేయనున్నట్లు తెలిపారు. 1, 53, 863 ఓటర్ల కొరకు 1 లక్ష 86 వేల 250 బ్యాలెట్ పేపర్లను 20 శాతం అధికంగా వినియోగిస్తున్నట్లు చెప్పారు. రెండవ విడతలో జరుగు ఎన్నికలకు 5 మండలాలను 7 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్కు ఒక సెక్టోరల్ అధికారిని నియమించడం జరిగిందన్నారు. పోలింగ్ సిబ్బంది, పోలింగ్ సామాగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరవేయుట గాను: 37 వాహనాలను కేటాయించినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఒక పోలీసు ఉండేవిధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతి మండలంలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ అంద జేసి వాహనాలలో ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించడం జరిగిందని, వారు నేటి సాయంత్రా నికల్లా ఆయా పోలింగ్ కేంద్రాల్లో చేరుకున్నారని అన్నారు. రెండవ విడత ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు కార్యక్ర మంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.