వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మహారాష్ట్రలో… రాష్ట్రపతి పాలన

November 12, 2019

కేంద్ర క్యాబినేట్‌ ఆమోదం – సుప్రీమ్‌ ‌కోర్టును ఆశ్రయించిన శివసేన
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు కేంద్రం ఆమోదం తెలిపింది. గవర్నర్‌ ‌భగత్‌ ‌సింగ్‌ ‌కోష్యారి సిఫార్సుకు అనుగుణంగా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు మంగళవారం మధ్యాహ్నం జరిగిన కేంద్ర క్యాబినెట్‌ ‌భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహారాష్ట్రలో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమై సంఖ్యా బలం లేనందున గవర్నర్‌ ‌సిఫార్సును పరిగణనలోకి తీసుకుని కేంద్ర క్యాబినెట్‌ ‌రాష్ట్రపతి పాలనకు ప్రతిపాదించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 145 స్ధానాల మేజిక్‌ ‌ఫిగర్‌కు చాలా దూరంలో నిలవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆసక్తి కనబరచలేదు. మరోవైపు రెండో అతిపెద్ద పార్టీగా శివసేనను గవర్నర్‌ ఆహ్వానించినా..డెడ్‌లైన్‌లోగా బలనిరూపణ చేయలేదు. డెడ్‌లైన్‌ ‌పొడిగించాలన్న శివసేన వినతిని గవర్నర్‌ ‌తోసిపుచ్చారు. ఇక మూడో అతిపెద్ద పార్టీ ఎన్సీపీని మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాలని కోరుతూ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందింది. ఈ దిశగా ఎన్సీపీ..కాంగ్రెస్‌, ‌శివసేనలతో సంప్రదింపులు జరుపుతుండగానే రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ ‌సిఫార్సు చేయడం, ఇందుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేయడంపై విపక్షాలు విస్మయం వ్యక్తం చేశాయి.ఇదిలాఉంటే, క్షణక్షణానికి మలుపులు తిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ప్రభుత్వ ఏర్పాటు అవసరమైన మద్దతు కూడగట్టుకునేందుకు అదనపు గడువు కోరితే గవర్నర్‌ ‌తిరస్కరించారని శివసేన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గవర్నర్‌ ‌నిర్ణయాన్ని సవాల్‌ ‌చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుపై వైఖరి తెలియజేసేందుకు బిజెపికి మూడు రోజులు గడువు ఇచ్చిన గవర్నర్‌ ‌తమకు మాత్రం 24 గంటలు మాత్రమే ఇచ్చారంటూ శివసేన తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా మంగళవారం నాడే విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరింది.