వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మూడు బులెట్లు… ముగ్గురు మహిళలు బస్తర్‌లో ఒక బూటకపు ఎన్‌కౌంటర్‌

April 27, 2019

2019 ‌ఫిబ్రవరి 2వ తేదీన ఆమె నిద్ర పోతున్న తన పిల్లలను వదిలి గొడ్డలి పుచ్చుకుని ఇతర మహిళలతో కలిసి సమీపంలో ఉన్న అడవికి కలప ఏరుకునేందుకు వెళ్ళింది. చత్తీస్‌ ‌ఘడ్‌ ‌సుకుమా జిల్లా కుంట తహసిల్‌ ‌లోని గూడెల గూడ గ్రామానికి వెళ్ళింది. సుక్కీ, కాలమ దేవే, పోడియం హుంగి మరో ఇద్దరు మహిళలు తమ గ్రామంలో సరస్సును దాటి అరకిలోమీటర్‌ ‌దూరం వెళ్ళారు. అక్కడ భద్రతా దళాలు ఎదురుగా రావడం వారు గమనించారు. తుపాకీ మోతకు వారు భయపడి వెనక్కి మళ్ళారు. తాము అడవిలో కలప సేకరించేందుకు వచ్చామని బిగ్గరగానే అన్నారు. అవతల వ్యక్తుల దాడికి సుక్కీ, దేవే గాయపడ్డారు. హుంగీ పక్కనుంచి బుల్లెట్‌ ‌దూసుకుని పోయింది.బస్తర్‌లో రాజ్య హింస దశాబ్ద కాలంగా సర్వసాదారణం అయింది. లోక్‌ ‌సభ ఎన్నికల హడావుడిలో అది అసలు ఎవరికీ పట్టని అంశం. మనం రోజూ చేసే పనులు ఉంటాయి. కడపటిసారి మనం ఎప్పుడు ఏం చేశామో గుర్తుండదు. ఘర్షణ ప్రాంతాల్లో ఎటువంటి హెచ్చరిక లేకుండా అనూహ్యమైన రీతిలో యుద్ధాలు చొచ్చుకుని వస్తుంటాయి.
పోడియం సుక్కీ కథ అలాంటిదే. 2019 ఫిబ్రవరి 2వ తేదీన ఆమె నిద్ర పోతున్న తన పిల్లలను వదిలి గొడ్డలి పుచ్చుకుని ఇతర మహిళలతో కలిసి సమీపంలో ఉన్న అడవికి కలప ఏరుకునేందుకు వెళ్ళింది. చత్తీస్‌ ‌ఘడ్‌ ‌సుకుమా జిల్లా కుంట తహసిల్‌ ‌లోని గూడెల గూడ గ్రామానికి వెళ్ళింది. సుక్కీ, కాలమ దేవే, పోడియం హుంగి మరో ఇద్దరు మహిళలు తమ గ్రామంలో సరస్సును దాటి అరకిలోమీటర్‌ ‌దూరం వెళ్ళారు. అక్కడ భద్రతా దళాలు ఎదురుగా రావడం వారు గమనించారు. తుపాకీ మోతకు వారు భయపడి వెనక్కి మళ్ళారు. తాము అడవిలో కలప సేకరించేందుకు వచ్చామని బిగ్గరగానే అన్నారు. అవతల వ్యక్తుల దాడికి సుక్కీ, దేవే గాయపడ్డారు. హుంగీ పక్కనుంచి బుల్లెట్‌ ‌దూసుకుని పోయింది.
మేం గూడేల గూడా చేరుకునే సరికి రాత్రి అయింది. మోటారు సైకిళ్ళ హెడ్‌ ‌లైట్లలో అక్కడి ఇళ్లు, ఆరు బయలు ప్రదేశాలను గుర్తించాం. ఒక ఇంటి సమీపంలో ఆరు బయలు ప్రదేశంలో ఆగాం. అక్కడ మట్టి నేలమీద కొందరు మహిళలు కూర్చుని ఉన్నారు. అందమైన, ఆరోగ్యవంతమైన పసిపాప అందమైన దుప్పటి లేదా వస్త్రం లాంటి గుడ్డపై పడుకోబెట్టబడి ఉంది. ఆ పసిపాప మూడు నెలల ప్రాయం గలది. ఆ పిల్ల సుక్కీ నలుగురు పిల్లలలో ఆఖరిది. మేం అక్కడ నులక మంచాల మీద కూర్చున్నాం. దేవే, హుంగీ వచ్చారు. సుక్కీ భర్త మిగిలిన ముగ్గురు పిల్లలతో వచ్చాడు . ఆ పిల్లల్లో ఆరేళ్ళ పిల్ల పెద్దది. దేవే, హుంగిలు ఇరవై ఏళ్ళ వయసు వారు. దేవే ముఖంలో ఆరోజు ఉదయం జరిగిన ఘటన తాలూకు భయం దిగ్భ్రాంతి కొట్టొచ్చినట్టు కనిపించింది. సుక్కీని పొట్ట మీద కొట్టారని ఆమె చెప్పింది. తన ఎడమ తొడ మీద కొట్టారని చెప్పింది. ఆ దెబ్బతో తాను స్పృహ కోల్పోయానని ఆమె చెప్పింది. హుంగి సన్నగాఉంటుంది. ఆమె ఇంకా విషాదం నుంచి కోలుకోలేదు. తాను తప్పించుకోగలిగాని దేవేని గ్రామంలోకి ఈడ్చుకుని వెళ్ళానని చెప్పింది.
ఈ సంఘటన తర్వాత ఆ గ్రామంలోకి వెళ్ళి ఆమ్‌ ఆద్మీ పార్టీ సభ్యులు, ఆదివాసీ హక్కుల కార్యకర్తలతో ఆదివాసీ నాయకుడు సోనీ సోరీ ఆ గ్రామంలోకి వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకు వెళ్ళారు. కొంతమంది కొంతమంది గ్రామీణ మహిళలు ఆ ప్రదేశానికి వచ్చారు. సుక్కీకి మంచినీటిని తెచ్చారు. భద్రతా దళాలు ఆమెపై ఒక మావోయిస్టు యూనిఫారంను కప్పాయి. దాంతో వారంతా నిరసన తెలిపారు. ఆమెను ఒక పోలిథిన్‌ ‌పేపర్‌ ‌లో చుట్టారు. ఆమె ఇంకా బతికి ఉన్నప్పటికీ, మంచినీరు అడుగుతున్నప్పటికీ ఆమెను పోలిథిన్‌ ‌కాగితంలో చుట్టారు. దేవే తన కుటుంబ సభ్యులు ఈ ఘటన గురించి ఫోన్‌లో చెప్పారని చెప్పాడు. అతడు తెలంగాణలోని ఒక గ్రామంలో పొలంలో పని కోసం వెళ్ళాడు. భద్రతా దళాలు తన భార్యను తీసుకుని పూస్వాడాలోని సిఆర్‌పిఎఫ్‌ ‌శిబిరానికి తీసుకుని వెళ్ళాయని, అక్కడ ఒక ఆస్పత్రి ఉందని చెప్పారని అన్నాడు.
ఆ శిబిరం వద్దకు అతడి తల్లి, ఇతరులు చేరుకునే సరికి సుక్కి మరణించింది. ఆమె శవాన్ని ఆరోజు రాత్రి పొద్దు పోయిన తర్వాత ఇచ్చారు. ఇందుకోసం బంధువులను గంటల కొద్ది నిరీక్షింపజేశారు. అక్కడ సంప్రదాయాలను పాటించనివ్వకుండా ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిపించాలని భద్రతా దళాలు తొందర పెట్టాయి.
ఎన్‌కౌంటర్‌లో మరణించిందా లేదా చంపాశారా?
ఈ ఘటన గురించి స్థానిక వార్తా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. సుకుమా జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ‌జితేంద్ర శుక్లాను ఉటంకిస్తూ సిఆర్‌ ‌పిఎఫ్‌ ‌దళాలు పూస్వాడా శిబిరానికి జిల్లా పోలీసు సిబ్బందితో వస్తుండగా, గూడెం గూడా వద్ద మావోయిస్టులతో ఎన్‌కౌంటర్‌ ‌జరిగిందనీ, నక్సలైట్‌ ‌మహిళ మరణించిందని చెప్పారు. మరో నక్సలైట్‌ ‌మహిళ గాయపడిందనీ, ఆమెను పట్టుకున్నామని చెప్పారు. అది బూటకపు ఎన్‌ ‌కౌంటర్‌ అన్న ఆరోపణలు వచ్చిన తర్వాత ఎస్‌పి తన ప్రకటనను కొద్దిగా సవరించారు. ఈ ఇద్దరు మహిళలూ పౌరులేనని అంగీకరించారు. వారు మావోయిస్టు యూనిఫారంలో లేరని అంగీకరించారు. అయితే, వారు ఎన్‌ ‌కౌంటర్‌ ‌సమయంలో ఎదురు కాల్పుల్లో మరణించారని చెప్పారు. అయితే, ఎస్‌పీ చెప్పిన కథనాలన్నీ దేవే, హుంగీ, ఇతర గ్రామస్తులు చెప్పిన విషయాలకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఆ రోజు మావోయిస్టుల అక్కడ లేనే లేరు. ఎదురు కాల్పులు జరగలేదు. ఈ విషయాన్ని కుంట ప్రాంత సిపిఎంఎల్‌ (‌మావోయిస్టు) కార్యదర్శి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో ఆరోజున మావోయిస్టుల కార్యకలాపాలు లేవని అన్నారు.
స్థానిక జర్నలిస్టులు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ గొడ్డళ్లు కనిపించాయి. ఆ ప్రదేశంలో గడ్డి మీద కానీ, నేల మీద కానీ రక్తపు మరకలు ఎక్కడా కనిపించలేదు. భద్రతా దళాలు సాక్ష్యాలను మాయం చేయడానికి ప్రయత్నించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాక ఎన్‌కౌంటర్‌ ‌ప్రాంతం అటవీ ప్రాంతంలోనిది కాదని తేలింది. అక్కడ అందిన సమాచారాన్ని బట్టి మూడు బుల్లెట్లను ఉద్దేశ్య పూర్వకంగానే ప్రయోగించారు. ఈ ముగ్గురు యువతులను మావోయిస్టులన్న అనుమానంపై కిరాతకంగా కాల్చేశారు.
పరిహారం కోసం డిమాండ్‌
‌కుంట నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కావాసీ లఖ్మా రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడు. ఆయన కూడా ఇది బూటకపు ఎన్‌ ‌కౌంటర్‌ అని అంగీకరించారు. ఈ ముగ్గురు మహిళలు గూడేల గూడా గ్రామానికి చెందిన వారనీ, వారి వద్ద ఆయుధాలు ఏమీ లేవని అన్నారు. ఇలాంటి సంఘటనలు ప్రజల మానసిక స్థయిర్యాన్ని దెబ్బతీస్తాయని ఆయన అన్నారు. సర్వ ఆదివాసీ సమాజ్‌ ‌వంటి ఆదివాసీ సంఘాలు సుకుమా జిల్లా బంద్‌కు పిలుపుఇచ్చాయి. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబానికి శాసనసభ్యుడు కావాసీ లఖ్మా ద్వారా ఐదు లక్షల రూపాయిలు, గాయపడిన వారికి లక్ష రూపాయిలు అందింది. జిల్లా పాలనా యంత్రాంగం 25 వేలు, 20 వేలు వంతున చెల్లించినట్టు ఎస్‌పి జితేంద్ర శుక్లా చెప్పారు.
ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత పోలంపల్లి థానాలో ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేసారు. గుర్తు తెలియని వ్యక్తి మరణించినట్టు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై న్యాయవిచారణకు ఫిబ్రవరి 6వ తేదీన ఆదేశించారు. రెండు నెలలు గడిచినా ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. దీనిపై ఆదివాసీ జర్నలిస్టు లింగారం, కొడొపి అక్కడ తాను వివరాలు సేకరించినట్టు, ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్‌ ‌కౌంటరేనని అన్నారు. పోలీసులు జరిపించే దర్యాప్తులన్నీ కంటి తుడుపు చర్యలేనని అన్నారు. మావోయిస్టుల వేట కోసం భద్రతాదళాలు అడవుల్లోకి వెళ్లినప్పుడు వేట కోసం వెళ్ళినట్టుగానే భావిస్తున్నాయనీ.. తమ వెంట జవాన్లనూ, ఆయుధాలనూ, పోలిథిన్‌ ‌షీట్లను తీసుకుని వెళ్తున్నాయని ఆయన చెప్పారు. వేట తర్వాత ఆదివాసీల మృత దేహాలను పోలిథిన్‌ ‌షీట్లలో చుట్టేసి జర్నలిస్టులను పిలిపించి ఇవి మావోయిస్టుల మృత దేహాలని చెబుతుంటారని అన్నారు. బస్తర్‌లో చట్ట బద్దమైన పాలన లేదు. మూడు బుల్లెట్లను ప్రయోగించిన సిఆర్‌ ‌పిఎఫ్‌ ‌జవాన్లపై ఐపీసీ 302 (హత్య), 307 (హత్యాయత్నం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన అన్నారు. అయితే, బస్తర్‌లో చట్టబద్దమైన పాలన లేదు. ఆటవిక రాజ్యం నడుస్తోంది. అందుకు ఇదే ఉదాహరణ.

– బేలా భాటియా
‘ద వైర్‌’ ‌సౌజన్యంతో..