వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

యాదాద్రిలో టెన్షన్‌..‌టెన్షన్‌

September 7, 2019

‌రాజకీయ పార్టీలో ఆందోళనలతో ఉద్రిక్తత
భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
కొండపైకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్ల ఏర్పాటుప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ఉత్కంఠ నెలకొంది. రాజకీయ పార్టీల నిసనలు,ఆందోళనతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యాదాద్రి కొండపైకి వెల్లి ధర్నా చేయాలనుకున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆలయ స్తంభాలపై సీఎం కేసీఆర్‌, ‌ప్రభుత్వ పథకాలు చెక్కడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రధాన ఆలయంపై ఈ బొమ్మలు ఉండడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ గుర్తుతో పాటు ఇతర చిత్రాలు చెక్కడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిని వ్యతిరేకిస్తూ బీజేపీ, కాంగ్రెస్‌, ‌సీపీఐ పార్టీలు కొండపైన నిరసనలు వ్యక్తం చేశాయి. దీంతో ఆలయం దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఆలయాన్ని పూర్తిగా తమ అధీనంలోకి
తీసుకున్నారు. నిరసన కారులు కొండపైకి వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు.మరోవైపు స్థానికకాంగ్రెస్‌ ‌నాయకలు నిరసనల ర్యాలీలు చేపట్టారు. పవిత్ర ఆలయ స్తంభాలపై నేతల చిత్రాలు చెక్కడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంలో ప్రరదర్శన నిర్వహంచారు. ఈ ఘటనలతో అప్రమత్తంఅయిన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.