వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

యువకుని చూపు సజీవం..!

May 11, 2019

గోదావరిఖని ఇందిరా నగర్ కు చెందిన పింగిలి మహేందర్(32) అనే యువకుడు ఈ రోజు తెల్లవారు జామున వడదెబ్బతో మృతి చెందాడు. మహేందర్ నేత్రాలను దానం చేయడానికి అతని తల్లితండ్రులు శంకర్, ప్రమీల, సోదరులు యుగంధర్, వనెందర్, వదినలు ఉమారాని, డివ్యారాని ముందుకు వచ్చారు. అవయవ దానం ప్రచారకర్త కే.యస్.వాసు ద్వారా సమాచారం తెలుసుకున్న లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బెనిగోపాల్ త్రివేది గారు స్పందించి టెక్నీషయన్ ఆరిఫ్ ద్వారా మహేందర్ నేత్రాలను సేకరించారు. సేకరించిన నేత్రాలను హైదరాబాద్ లోని ఎల్ వీ ప్రసాద్ ఐ బ్యాంక్ కు పంపించారు. విషాదంలో కూడా కుటుంబ సభ్యులు నేత్రదానం చేయడానికి ముందుకు రావడం పట్ల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు త్రివేది, సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రావణ్ కుమార్, లింగమూర్తి, కే.యస్.వాసు, జాతీయ యువజన అవార్డ్ గ్రహీత ఈదు నూరి శంకర్ తదితరులు అభినందించారు. మహేందర్ కు శ్రద్ధాంజలి ఘటించారు.