వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

యూరియా తక్షణం తెప్పించండి రైతులకు అందించండి

September 6, 2019

ఉన్నతస్థాయి సక్ష చేపట్టిన సిఎం కెసిఆర్‌రాష్ట్రంలో రైతులందరికీ సరిపోయేంత యూరియాను తక్షణమే సరఫరా చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సిఎం తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలోని రైతులకు ఎరువులు అందించే విషయంపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంత యూరియా డిమాండ్‌ ‌రావడానికి గల కారణాలను వ్యవసాయశాఖ అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులందరికీ సరిపోయేంత యూరియాను తక్షణం గ్రామాలకు సరఫరా చేయాలన్నారు. మూడు నాలుగు రోజుల్లోనే డిమాండ్‌కు తగినంత ఎరువులను సంపూర్ణంగా రైతులకు అందజేయాలన్నారు. వివిధ నౌకాశ్రయాల్లో ఉన్న స్టాక్‌ను రైళ్లు, లారీల ద్వారా వెంటనే తెప్పించి స్టాక్‌ ‌పాయింట్లలో పెట్టకుండా నేరుగా గ్రామాలకే పంపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని యుద్దప్రాతిపదకన చేయాలన్నారు. తక్షణమే రైతులకు యూరియా సరఫరా చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాలుగు రోజుల్లో డిమాండ్‌కు తగినంత ఎరువులు అందజేయాలన్నారు. ఎరువుల రవాణా విషయమై ఏపీ మంత్రి పేర్ని నానితో సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడారు. గంగవరం పోర్టు నుంచి వీలైనన్ని ఎక్కువ లారీల ద్వారా యూరియా పంపడానికి సహకరించాలని కోరారు.