అల్లా దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలన్న హరీష్రావు
రంజాన్ మాసం ప్రారంభం కానున్న సంద ర్భంగా ప్రజలం దరికీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఎంతో పవిత్రంగా ,భక్తి శ్రద్ధలతో కఠోరమైన దీక్షలతో ఈ మాసాన్ని జరుపుకుంటా రన్నారు. అల్లా దీవేనతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షిం చారు. రంజాన్ మాసంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలా సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ రంజాన్ పండుగను అధికారికంగా ప్రకటించడంతో పాటు నిరుపేద ముస్లింలకు దుస్తులు నిత్యావసర సరుకులు అందుస్తున్నామన్నారు.