వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

రామలింగేశ్వరుడికి సీఎం కేసీఆర్‌ ‌ప్రత్యేక పూజలు

May 10, 2019

కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి

photo : రామేశ్వరం చేరుకున్న సిఎం కెసిఆర్‌ ‌దర్శనానికి ముందు సముద్రంలో ఆచమానం చేస్తున్న దృశ్యం.

రామేశ్వరాలయంలో కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్‌. ‌చిత్రంలో కెటిఆర్‌, ‌తదితరులు.

తమిళనాడులో టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కుటుంబంతో కలిసి శుక్రవారం రామేశ్వరం వెళ్లిన కేసీఆర్‌.. ‌రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో సీఎం కేసీఆర్‌ ‌దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దసుష్కోటి, రామసేతు, పంచముఖ హనుమాన్‌లను సీఎం, కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, సిబ్బంది సీఎం కేసీఆర్‌ ‌దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితో పాటు టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌, ‌రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ఉన్నారు. ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా కేసీఆర్‌ ‌దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించి పార్టీల మద్దతు కోరుతున్నారు. రెండురోజుల క్రితమే కేరళ సీఎం విజయన్‌తో సమావేశమయ్యారు. తాజా రాజకీయాలపై చర్చించారు. బుధవారం తమిళనాడు చేరుకున్న కేసీఆర్‌.. ‌పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు. బుధవారం కన్యాకుమారిలో సీఎం పర్యటించారు. కాగా కేసీఆర్‌ ‌డీఎంకే అధినేత స్టాలిన్‌ను కలవబోతున్నట్లు తెలుస్తుంది.