వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

రామ్ హీరోగా ప్ర‌వీణ్ స‌త్తారు చిత్రం ప్రారంభం

April 28, 2018

రామ్ హీరోగా, ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స్ర‌వంతి మూవీస్ సంస్థ సినిమా మొద‌లుపెట్ట‌నుంద‌ని తొలి వార్త విడుద‌లైన‌ప్ప‌టి నుంచి ట్రేడ్ వ‌ర్గాల్లోనూ అమితాస‌క్తి కనిపించింది. అలా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోన్న ఈ సినిమా ప్రారంభోత్స‌వం నిరాడంబ‌రంగా యూనిట్ స‌భ్యుల స‌మ‌క్షంలో గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఉత్త‌మాభిరుచిగ‌ల నిర్మాత `స్ర‌వంతి` ర‌వికిశోర్ నిర్మిస్తున్నారు. యువ ప్ర‌తిభాశాలి పి.కృష్ణ‌చైత‌న్య ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చిత్ర నిర్మాత `స్ర‌వంతి` ర‌వికిశోర్ మాట్లాడుతూ “ఏప్రిల్ 26న గురువారం హైద‌రాబాద్‌లో నిరాడంబ‌రంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాం. మే 7 నుంచి జార్జియాలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మే నెలాఖరు వ‌ర‌కు తొలి షెడ్యూల్ సాగుతుంది. ఆ త‌ర్వాత స్విట్జ‌ర్లాండ్‌, ఫ్రాన్స్, ఇట‌లీలోని సుంద‌రమైన ప్ర‌దేశాల్లో కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తాం. విదేశాల నుంచి తిరిగి వ‌చ్చాక కాశ్మీర్‌, ల‌డ‌ఖ్‌లో భారీ షెడ్యూల్స్ చేస్తాం. న్యూ వేవ్ లో సాగే చిత్ర‌మిది. మ‌రిన్ని విశేషాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం“ అని చెప్పారు.