వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

రాలిన బీజేపీ ‘‘అరుణ’’కిరణం

August 24, 2019

కీలక బీజేపీ సీనియర్‌ ‌నేత, రాజ్యసభ సభ్యుడు అరుణ్‌ ‌జైట్లీ(66) అనారోగ్యంతో కన్నుమూశారు. కాన్సర్‌ ‌తో బాటు తీవ్ర ఊపిరి సంబంధిత సమస్యలతో ఈ నెల 9న ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన అరుణ్‌ ‌జైట్లీ శనివారం మధ్యాహ్నం 12.09 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఎయిమ్స్ ‌వర్గాలు మీడియాకు ప్రెస్‌నోట్‌ ‌విడుదల చేసాయి. అరుణ్‌ ‌జైట్లీ 1952లో డిసెంబర్‌ 28‌న మహరాజ్‌ ‌కిషన్‌ ‌జైట్లీ, రత్నప్రభ దంపతులకు ఢిల్లీలో జన్మించారు. తండ్రి లాహోర్‌ ‌నుండి వలసవచ్చిన ప్రముఖ న్యాయవాది కావడంతో జైట్లీ కూడా అదే రంగం వైపు అడుగులు వేశారు.. 1977లో ఢిల్లీలోని లా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన విద్యార్థి దశలోనే అరుణ్‌ ‌జైట్లీ అఖిల భారత విద్యార్థి పరిషత్తు నాయకుడుగా పనిచేశారు. ఎమర్జెన్సీ టైమ్‌లో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలులో వాజపేయిలాంటి గొప్ప నేతలను కలవడం జైట్లీ జీవితాన్ని మార్చేసింది..జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్‌ ‌పార్టీ (ఇప్పటి భారతీయ జనతా పార్టీ)లో చేరారు. విశ్వనాథ్‌ ‌ప్రతాప్‌ ‌సింగ్‌ ‌ప్రధానమంత్రిగా పనిచేసిన టైమ్‌లో అరుణ్‌ ‌జైట్లీ సొలిసిటర్‌ ‌జనరల్‌గా ఎంపిక చేయబడ్డారు. 1991 నుంచి భారతీయ జనతా పార్టీ కార్యవర్గంలో పనిచేస్తున్నారు. అటల్‌ ‌బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేబినెట్‌ ‌హోదా మంత్రిగా పనిచేశారు. గుజరాత్‌ ‌తో సహా పలు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా వ్యవహరించి పార్టీ అభివృద్ధికి ఎనలేని సేవలు చేశారు. 2014 సార్వత్రిక
ఎన్నికలలో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో అమృత్‌సర్‌ ‌నియోజకవర్గం నుంచి పోటీపడి… కాంగ్రెస్‌ అభ్యర్థి అమరీందర్‌ ‌సింగ్‌ ‌చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల సమయంలో అక్కడ నూతనంగా ప్రారంభమైన దాదాపు 40 బీజేపీ స్థానిక ఆఫీసులు జైట్లీ పై అభిమానంతో సన్నిహితులు ఏర్పాటు చేసినవే.. అయితే 2014లో మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రావడంతో అరుణ్‌ ‌జైట్లీని రాజ్యసభ సభ్యుడిని చేసి ఆర్థికమంత్రి పదవిని అప్పగించారు. అనారోగ్యంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో అరుణ్‌ ‌జైట్లీ పోటీ నుంచి తప్పుకున్నారు. అంతేకాకుండా మంత్రి పదవిని కూడా త్యజించారు. రాజ్యసభ సభ్యుడిగా మాత్రమే కొనసాగుతున్నారు.
రేపు అరుణ్‌ ‌జైట్లీ అంత్యక్రియలు
అనారోగ్యంతో ఎయిమ్స్ ‌లో చికిత్సపొందుతూ మరణించిన బీజేపీ సీనియర్‌ ‌నేత , మాజీ కేంద్రఆర్థికమంత్రి అరుణ్‌ ‌జైట్లీ పార్థివ దేహాన్ని కైలాష్‌ ‌కాలనీలోని నివాసానికి జైట్లీ తీసుకొచ్చి రేపు ఉదయం 10 గంటల వరకు సన్నిహితుల సందర్శనార్ధం జైట్లీ నివాసంలొ ఉంచినఅనంతరం రేపు ఉదయం బిజెపి కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లి 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బిజెపి కేంద్ర కార్యాలయంలో ఉంచుతారుఅనంతరం బిజెపి కేంద్ర కార్యాలయం నుంచి జైట్లీ అంతిమ యాత్ర కొనసాగనుంది. నిగమ్‌ ‌బోద్‌ ‌ఘాట్లో జైట్లీ అంత్యక్రియలు జరగనున్నాయి.దేశ విదేశాలనుంచి పలువురుప్రముఖులు హాజరుకానున్నారు