వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

రాహుల్‌కు ‘సుప్రీమ్‌’‌లో ఊరట

May 9, 2019

ద్వంద్వ పౌరసత్వంపై పిటిషన్‌ ‌కొట్టివేతకాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాహుల్‌ ‌కు బ్రిటన్‌ ‌పౌరసత్వం ఉందనీ, కాబట్టి ఎన్నికల్లో పోటీకి ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌ ‌ను అత్యున్నత న్యాయస్థానం గురువారం కొట్టివేసింది. బ్రిటన్‌ ‌కు చెందిన బ్యాకప్స్ ‌లిమిటెడ్‌ అనే కంపెనీలో రాహుల్‌ ‌డైరెక్టర్‌, ‌కార్యదర్శి హోదాలో ఉన్నారని పిటిషనర్‌, ‌హిందూ మహాసభ సభ్యుడు జై భగవాన్‌ ‌గోయల్‌ ‌సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2005-06 అర్ధిక సంవత్సరానికి కంపెనీ వార్షిక ఐటీ రిటర్నులో పౌరసత్వం అనే కాలమ్‌ ‌లో రాహుల్‌ ‌బ్రిటిషర్‌ అని రాశారని వెల్లడించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం విదేశీ పౌరసత్వం ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయడం కుదరదన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఓ కంపెనీకి సంబంధించిన పేపర్‌ ఆధారంగా కోర్టును ఎలా ఆశ్రయిస్తారని సీజేఐ జస్టిస్‌ ‌రంజన్‌ ‌గొగోయ్‌ ‌పిటిషనర్‌ ‌ను ప్రశ్నించారు. ఓ కంపెనీ పేపర్‌ ‌ను ఆధారంగా చేసుకుని కోర్టును ఆశ్రయించడం సరికాదని చెబుతూ పిటిషన్‌ ‌ను కొట్టివేశారు. కాగా, దేశంలోని నిరుద్యోగం, కరవు, ఉపాధి లేమి వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే రాహుల్‌ ‌పౌరసత్వం విషయంలో బీజేపీ రాద్ధాంతం చేస్తోందని కాంగ్రెస్‌ ‌పార్టీ మండిపడింది. రాహుల్‌ ‌పౌరసత్వంపై గతంలోనూ దుమారం రేగిన విషయం తెలిసిందే. రాహుల్‌ ‌పౌరసత్వ స్థితిని ప్రశ్నిస్తూ భాజపా ఎంపీ సుబ్రమణ్య స్వామి కేంద్ర హోంశాఖకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ రాహుల్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. అంతకుముందు ఇదే విషయమై 2015లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ ‌దాఖలైంది. రాహుల్‌ ‌పౌరసత్వంపై సీబీఐ విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. అయితే దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.