వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

రేపు జాతీయ విద్యా దినోత్సవం

November 9, 2019

విద్యావిధానంలో సమూల మార్పులు రావాలిస్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి విద్యా మంత్రి అయిన మౌలానా అబుల్‌ ‌కలాం ఆజాద్‌ ‌విద్యారంగానికి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని 2008 సంవత్సరము నుండి జన్మదినోత్సవం పురష్కరించుకుని నవంబర్‌ 11 ‌రోజున దేశ వ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవమును జరుపుకోవడం జరుగుతుంది. విద్య అందరికి అందుబాటులో ఉండాలని, ఏఐసిటిఈ మరియు యుజిసి వంటి అత్యున్నత సంస్థలను ఏర్పాటు చేయడానికి ఆజాద్‌ ఎం‌తో కృషి చేశారు. ఆజాద్‌ ఉర్దూ, పెర్షియన్‌, అరబిక్‌ ‌మరియు హిందీ భాషల్లో బాగా ప్రావీణ్యం ఉంది. పిల్లలకు 14 సంవత్సరాల వయస్సు వరకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయడాన్ని గట్టిగా సమర్ధించాడు. దేశంలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నందున వయోజన విద్య కోసం కృషి చేశాడు. ప్రాథ•మిక విద్య ద్వారా సంస్కృతి మరియు సాహిత్యాలను ప్రోత్సహించడంలో కూడా ఆజాద్‌ ‌కృషి మరువలేనిది. లలిత కళా అకాడెమి, సాహిత్య అకాడమీ వంటి అనేక సాంస్కృతిక మరియు సాహిత్య అకాడెమీలు స్థాపించడం జరిగింది.
మార్కులే ప్రామాణికమా….
విద్యార్థుల ప్రతిభకు మార్కులు కొలమానం కానే కాదు. మార్కుల ఆధారంగా వారి తెలివితేటలను కొలవకూడదు. ప్రపంచంలోని మేధావులంతా మార్కులేమీ సాధించిన వారు కాదు. పిల్లల చదువులను, మార్కులను తల్లిదండ్రులు వంశ ప్రతిష్టగా భావిస్తుంటారు. ఇది తప్పు. విద్యాసంస్థల యాజమాన్యాలు మార్కుల కోసం పిల్లలపై వొత్తిడి పెట్ట కూడదు. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనో, అనుత్తీర్ణులయ్యామనో బాధ పడొద్దు. మార్కులు ర్యాంకులే ప్రధానం కాదు. ప్రపంచంలో లక్ష్యాలేన్నో ఉన్నాయి అందులో మనమూ ఒకటి సాధిద్దాం. ఒక సమిధలా వెలుగుదాం. ప్రపంచానికి ఒక వెలుగును ప్రసాదిద్దాం. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏది ఉండదు, ఓటమి అన్నది ఎప్పుడు అపాయకారి కాదు. మనకు ఈ రెంటిని సాధించాల్సిన దానికి కావాల్సింది మనో దైర్ఘ్యం, ఆత్మ విశ్వాసం, పట్టుదల.
బ్రతికే మనోధైర్ఘ్యం కొరవడుతోందా….
ఇటీవల వార్తా పత్రికలలోని వార్తలను గమనిస్తే ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించుటలో విద్యార్థుల పాత్ర చాలా కీలకం. విద్యార్థుల జీవితాలు మద్యలోనే తుడుచుకు పెట్టుకు పోతున్నాయి. ఆధునిక కాలంలో కాలంతో పాటుగా పరుగులు తీస్తూ ప్రకృతిని శాసించే స్తాయిలో సాంకేతికంగా ఎంతో పురోగమించాం. ఎన్నో అవకాశాలు, వసతులు, సౌకర్యవంతమైన జీవన విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇదే సమయంలో ఒత్తిడితో కూడిన చదువులు, ఉద్యోగాలు,ఆర్థికంగా ఆకాశాన్ని అందుకోవాలనే ఆలోచనలు,విలాస వంతమైన జీవన విధానాలతో సైకలాజికల్‌ ‌కౌన్సెలింగ్‌ ‌సెంటర్ల అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక సంఘటనను పరిశీలెస్తే పిల్లలు హత్యలు చేయడానికి కూడా ప్రేరేపించబడుతున్నారు. మన తండ్రులు, తాతల వద్ద లక్షలు, కోట్ల రూపాయలు లేకున్నా ఆనందమయ జీవితం గడిపే వారు. అందుకు ప్రధాన కారణం వారసత్వంగా వచ్చిన జీవన నైపుణ్యాలే. వారిలో బ్రతక గలం అనే మనోదైర్ఘ్యం ఉండేది. కాని నేటి తరంలో అవి కొరవడుతున్నాయి. మార్కులు, ర్యాంకులే ప్రాతిపదికగా, చిన్న తనం నుండే ఐ.ఐ.టీ లు, మెడికల్‌ ‌ఫౌండేషన్‌ ‌ల పేరుతో వారి బాల్యాన్ని మొగ్గలోనే చిదిమేసే స్తాయిలో, ఒత్తిడితో కూడిన విద్యావిధానం, క్రమశిక్షణ కొరవడటం, విచక్షణ లేమి ఇవన్నీ కలసి విద్యార్థులను మానసిక వికలాంగులుగా తయారు చేస్తున్నాయి.చిన్నపాటి సమస్యను కూడా తనకుతానుగా పరిష్కరించుకోలేని దుస్థితిలోకి విద్యార్థిలోకం నెట్టి వేయబడుతున్నారనడంలో సందేహం లేదు.
– ‌డా. అట్ల శ్రీనివాస్‌ ‌రెడ్డి
కౌన్సెలింగ్‌ ‌సైకాలజిస్ట్ ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌
9703935321