వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

లడాక్‌ ‌నియోజకవర్గంలో .. బరితెగించిన బీజేపీ

May 7, 2019

జర్నలిస్టులకు రూ. 500 లంచం..
తిరస్కరించిన విలేఖరులు
బీజేపీపై కేసు నమోదు
అనైతిక చర్య.. ఖండించిన ఐజేయూ
జమ్మూ కశ్మీర్‌ ‌జర్నలిస్టుల వృత్తి నిబద్ధతను ప్రశంసించిన అధ్యక్షుడు దేవులపల్లి అమర్‌
జరుగుతున్న లోక్‌ ‌సభ ఎన్నికల సందర్భంగా జమ్మూ కశ్మీర్‌ ‌లేహ్‌లో భారతీయ జనతా పార్టీ నాయకులు జర్నలిస్టులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన సంఘటనను ఇండియన్‌ ‌జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది. వార్తలు తమకు అనుకూలంగా లేని పక్షంలో ‘ఫేక్‌ ‌ప్రచారం ‘ బనాయించుతామని బిజెపి నాయకులు బెదిరించినా .. ధైర్యంగా తిప్పికొట్టిన జర్నలిస్టులను అభినందిస్తూ ఐజేయూ ఒక ప్రకటన విడుదల చేసింది. జర్నలిస్టులను బెదిరించిన బిజెపి నాయకులపై కేసు నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్‌ ‌ఫైల్‌ ‌చేయాలని జిల్లా ఎన్నికల అధికారిని డిమాండ్‌ ‌చేసింది. గత వారం మే 2 , జమ్మూ కశ్మీర్‌ ‌రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు నిర్వహించిన పత్రికా సమావేశం అనంతరం ఆ పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ విక్రమ్‌ ‌రంధావా మరియు పార్టీ అధ్యక్షుడు తమ అనుకూల వార్తల ప్రచురణ కోసం హాజరయిన విలేఖరులకు రూ।। 500లు ఉన్న కవర్‌ను ఇవ్వడంతో ఆశ్చర్యానికి గురయిన వారు కవర్‌ను తిరిగి ఇవ్వడమే కాకుండా మరుసటి రోజు లేహ్‌, ‌లడక్‌ ‌జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు మొరుప్‌ ‌స్టాన్జిన్‌, ‌రిచర్డ్ ఆగమో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. వృత్తి పట్ల లేహ్‌, ‌లడక్‌ ‌జర్నలిస్టుల సంఘం నిబద్ధతను ఇండియన్‌ ‌జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు దేవులపల్లి అమర్‌, ‌సెక్రటరీ జనరల్‌ ‌సబీనా ఇంద్రజిత్‌ ‌ప్రశంసిస్తూ వారికి పూర్తి సంఘీభావం తెలిపారు. బీజేపీ ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘించిందని ..ఈ సమయంలో మీడియా అప్రమత్తంగా ఉంటూ తమ కర్తవ్యాన్ని బాధ్యతగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.