వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి

May 10, 2019

రోజు కూళీ పనులకు వెలుతూ ఎండ తీవ్రతతో వడదెబ్బ తగిలి వ్యవసాయ కూలీ మృతిచెందిన సంఘటన మండలంలోని లింగంపల్లి గ్రామంలో జరిగింది. కుటుంబీకులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం లింగంపల్లి గ్రామానికి చెందిన పచ్చిమండ్ల రామాంజనేయులు( 32) రోజువారీ కూళీగా పోతూ గురువారం రోజున ఆకస్మికంగా వడదెబ్బతో స్పృహ కోల్పోగా తోటికూళివారు హుటా హుటిన ఇంటికి తీసుకురాగా అప్పటికే మృతిచెందాడని వారు తెలిపారు. మృతునికి భార్య అనిత, ఇద్దరు పిల్లలున్నారు. గ్రామస్థులు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.