వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

విద్యాదానం గొప్పది..!

September 12, 2019

  • సీబీఐ మాజీ జాయింట్‌ ‌డైరెక్టర్‌ ‌వివి లక్ష్మినారాయణ
  • ఘనంగా ఎస్‌.ఇ.ఎస్‌ ఉన్నత పాఠశాల వ్యవస్థాపక దినోత్సవం
ఫోటో‌: ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసిన సీబీఐ మాజీ జాయింట్‌ ‌డైరెక్టర్‌ ‌వివి లక్ష్మినారాయణ.

అన్ని దానాల్లో కెల్లా విద్యా దానం గొప్పదని, అది శాశ్వత ఫలితాలు ఇవ్వడమే కాకుండా చైతన్యవంతమయిన సమాజా నిర్మాణానికి, దేశ అభ్యున్నతికి ఎంతో దోహదపడుతుందని సిబిఐ మాజీ జాయింట్‌ ‌డైరెక్టర్‌ ‌వి వి లక్ష్మినారాయణ, ఐ పి ఎస్‌ అన్నారు. హైదరాబాద్‌ ‌విద్యానగర్‌ ‌లోని శ్రీ సుబ్రమణ్య స్వామి ఎడ్యుకేషనల్‌ ‌సొసైటీ వారి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన వ్యవస్థాపక దినోత్సవం మరియు టీచర్స్ ‌డే కారక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆరోగ్యకరమయిన సమాజ నిర్మాణానికి క్రమ శిక్షణ, అంకిత భావం కలిగిన మహనీయుల సాంగత్యం ఏంతో అవసరమని విద్య సంస్థ నిర్వాహకులు కనకరాజు ను ఉద్దేశించి అన్నారు. 85 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గనక రాజు ఒక ఉపాధ్యాయునిగా సమాజానికి ఇంకా ఎదో చేయాలని తపన పడడం హర్షణీయమన్నారు. విద్యార్థులను సంబోధిస్తూ చెట్టు పెరగడానికి గాలి, నీరు, సూర్య రశ్మి ఎంత అవసరమో దాని చుట్టూ పెరుగుతున్న కలుపు మొక్కలను తీసివేయడం కూడా అంతే  అవసరమని.. విద్యార్థులు కూడా విద్యార్జన తో పాటు వారి ఉజ్వల భవిష్యత్తు కు తమ చుట్టూ చేరిన చెడు   సాంగత్యాన్ని, అలవాట్లను దరి చేయనియవ్వద్దని  సూచించారు. తల్లితండ్రులనుద్దేశించి మాట్లాడుతూ తమ పిల్లలను బడి కి పంపించడంతో సరిపోదని, వారికి తోటి విద్యార్థులతో కలిసిమెలిసి ఉండేలా సూచించాలని తెలిపారు. సంస్థ అధ్యక్షుడు దేవులపల్లి విజయ్‌ ‌తమ పాఠశాలలో పేద విద్యార్థులకు ఉచితంగా విద్య  బోధిస్తున్నామని, 10 వ తరగతిలో గణనీయమయిన ఫలితాలను పొందుతున్నామని తెలిపారు. గౌరవ అతిధులుగా రిజిస్ట్రేషన్‌ ‌మరియు స్టాంప్స్ ‌శాఖ  జాయింట్‌ ఇన్స్పెక్టర్‌ ‌జనరల్‌ ‌వేముల శ్రీనివాసులు, ఆఫ్ఘనిస్తాన్‌ ‌తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షుడు వి వి రామరాజు పాల్గొని తమ సందేశాన్ని అందించారు. కార్యక్రమం అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు సభికుల ప్రశంసలు పొందాయి.