వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

విద్యార్థులకు న్యాయం చేయడంలో.. ప్రభుత్వం విఫలం

May 9, 2019

ఇం‌టర్‌ ‌ఫలితాలపై  ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థి సంఘాల దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొ।। నాగేశ్వర్‌, ‌తదితరులు.
ఇం‌టర్‌ ‌ఫలితాలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థి సంఘాల దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొ।। నాగేశ్వర్‌, ‌తదితరులు.

మాజీ ఎం.ఎల్‌.‌సి. ప్రొ।। నాగేశ్వర్‌రావు
‘ఇంటర్‌’ అవకతవకలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా
ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐవైఎఫ్‌ ‌నిరవధిక నిరాహారదీక్షఇంటర్‌ ‌బోర్డు అవకతవకల వలన నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయడంలో, సంఘటనకు కారణమైన నిందితులను శిక్షంచడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎంఎల్‌సి ప్రొ।।నాగేశ్వరరావు అన్నారు. గురువారం హైదరాబాద్‌, ‌హిమాయత్‌నగర్‌లోని డా।। రాజబహదూర్‌గౌర్‌ ‌హాల్‌ ‌ముందు ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐవైఎఫ్‌ ‌రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఇంటర్‌ ‌బోర్డు అవకతవకలు, రాష్ట్ర ప్రభుత్వం చర్యలను నిరసిస్తూ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు ఆయన సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 రోజులుగా రాష్ట్రంలో విద్యార్థుల చావులు మరణమృందంలా జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌మాత్రం పట్టిపట్టనట్లుగా వుండటం బాధాకరమని, ఇంటర్‌ ‌బోర్డు అక్రమాలు బహిర్గతంగా సమాజానికి కనిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు కనబడటం లేదో అర్థంకావడం లేదని అన్నారు. విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఈ సంఘటనపై విచారణ వ్యక్తం చేస్తూ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిన అవసరం వుందని అన్నారు. ఇంటర్‌ ‌బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌ ‌పుటకో మాట మార్చడం బావ్యం కాదని, ఇందంతా జరగడానికి అశోక్‌కుమారే బాధ్యుడని దుయ్యబట్టారు. గ్లోబరీనా సంస్థతో వ్రాతపూర్వక ఒప్పందం చేసుకోకుండా 9 లక్షల 54 వేయిల ఇంటర్‌ ‌విద్యార్థుల భవిష్యత్‌ను ఏ విధంగా ఇంటర్‌బోర్డు గ్లోబరీనాకు బాధ్యతలు అప్పగిస్తారని ప్రశ్నించారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారాగాని, ఇంటర్‌బోర్డు ద్వారా గాని ఎందుకు పరామర్శించలేకపోయారని అన్నారు. ఇంటర్‌ ‌బోర్డు అవకతవకలపై విద్యార్థి, యువజన సంఘాలు 20 రోజులుగా వివిధ రూపాలల్లో నిరసనలు చేస్తుంటే సంఘటనలపై విచారించకుండా నిరసనలు వ్యక్తం చేసిన వారిపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. బంగారు తెలంగాణ అంటున్న కేసిఆర్‌ ‌విద్యార్థులకు బతుకు భరోస ఇవ్వలేకపోతున్నారని అన్నారు. ఇంటర్‌బోర్డు సంఘటనలపై సిట్టింగ్‌ ‌జడ్జీచే విచారణ చేపట్టి, నిందితులను శిక్షించాలని, నష్టబోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ఈ దీక్షలకు టిపిసిసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌, ‌సిపిఐ ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, టిజెసి నాయకులు ప్రొ।। విశ్వేశ్వర్‌రావు, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి వినోద్‌రెడ్డి, అరుణోదయ సాంస్కతిక మండలి అధ్యక్షురాలు విమలక్క, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌, ‌సిపిఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు డా।।సుధాకర్‌, ‌యన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ నాయకులు పోటు కళావతి, చాయా దేవి, ఎంఎస్‌ఎఫ్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు నరేష్‌మాదిగా, టివివి రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి తమ సంఘీభావం తెలిపారు. దీక్షకు ఉపక్రమించిన వారిలో ఎఐఎస్‌ఎఫ్‌ ‌రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు యన్‌. అశోక్‌స్టాలిన్‌, ‌రావిశివరామకృష్ణ, ఎఐవైఎఫ్‌ ‌రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్‌ ‌వల్లీఉల్లాఖాద్రీ, మారుపాక అనిల్‌కుమార్‌, ఎఐఎస్‌ఎఫ్‌ ‌రాష్ట్ర ఆర్గనైజింగ్‌ ‌సెక్రటరీలు ఆర్‌.ఎన్‌.‌శంకర్‌, ఎఐవైఎఫ్‌ ‌రాష్ట్ర ఉపాధ్యక్ష, సహాయ కార్యదర్శులు నెర్లకంటి శ్రీకాంత్‌, ‌లింగం రవి, ఎఐఎస్‌ఎఫ్‌ ‌హైదరాబాద్‌ ‌కార్యదర్శి గ్యార నరేష్‌, ‌రంగారెడ్డి కార్యదర్శి గ్యార క్రాంతి, ఎఐఎస్‌ఎఫ్‌ ఉస్మానియా యూనివర్శిటీ కార్యదర్శి కంపెల్లి శ్రీను ఉన్నారు. ఈ కార్యక్రమాలలో ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐవైఎఫ్‌ ‌రాష్ట్ర నాయకులు పుట్ట లక్ష్మన్‌, ‌బరిగెల వెంకటేశ్‌, ‌మర్రి శ్రీనివాస్‌, ‌సత్యప్రసాద్‌, ‌కె.నరేష్‌, ‌బాలసాని లెనిన్‌, ‌ప్రేమ్‌, ‌వికాస్‌, ‌యం.వంశీ, బాలిరెడ్డి, హరీష్‌ ఆజాద్‌, ‌శ్రీమన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.