వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

విద్యార్థులు పరీక్షలంటే భయపడొద్దు

March 7, 2019

విజయస్ఫూర్తిపై విద్యార్థుల కు మార్గనిర్దేశం చేసిన కలెక్టర్‌
విద్యార్థులు పరీక్షలం టే భయపడొద్దనీ జిల్లా కలెక్టర్‌ దేవరకొండ కృష్ణభాస్కర్‌ విద్యార్థుల కు మార్గనిర్దేశం చేశారు. బుధవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల లోని 10వ తరగతి విద్యార్థుల కు ప్రముఖ మానసిక నిపుణులు డాక్టర్‌ సి.వీరేందర్‌, డిఈవో రమాకాంత్‌రావు, మండల విద్యాధికారు ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ స్ఫూర్తి కార్యక్రమానికి కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ…10వ తరగతి పరీక్షలు అంటే పాస్‌ అవుతామో…లేదోననీ అనే వాళ్లకు అలాంటి తెలియని ఆందోళను విద్యార్థులు నుంచి దూరం చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పాస్‌ అవుతామనీ ధీమాగా ఉన్న వాళ్లలో 10జిపిఏ, 9జిపిఏ, 8జిపిఏ వస్తుందా…లేదా అనుకుంటూ ఉంటారన్నారు. అలాంటి వారితో పాటు పాస్‌ అవుతామో… లేదోనని కంగారు పడే వారు ఈ విజయ స్ఫూర్తి కార్యక్రమాన్ని శ్రద్ధగా విని అనుకున్న విధంగా తమను తాము మార్చుకుంటే గొప్ప మార్కు వస్తాయన్నారు. ఇందుకు పువురు విద్యార్థు స్పందిస్తూ డాక్టర్‌, ఇంజనీర్‌, పోలీస్‌, ఐఏఎస్‌, ఐపిఎస్‌, టీచర్‌ అవుతామంటూ చెబుతున్న క్రమంలో క్ష్యాను నిర్దేశించుకోవడం కరెక్టేననీ, ఆ క్ష్య సాధనకు చేయాల్సిన మానసిక సాధన చేయాన్నారు. అనంతరం మానసిక నిపుణు వీరేందర్‌ విద్యార్థుకు మానసిక వొత్తిడిను అధిగమించేలా చేయాల్సిన, తీసుకోవల్సిన జాగ్రత్తను విద్యార్థుకు అర్థమయ్యేలా వివరించారు.