వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

వేగంగా పారిశ్రామికీకరణ

December 4, 2019

పర్యావరణహితంగా పరిశ్రమలు ఏర్పాటు
ఓఆర్‌ఆర్‌ ‌వెలుపల కాలుష్య రహితంగా పరిశ్రమలు ఏర్పాటు
టీఎస్‌ఐపాస్‌ ఐదో వార్షికోత్సవ వేడుకల్లో స్పష్టం చేసిన మంత్రి కెటిఆర్‌
రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పర్యావరణహితంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్న నిబంధనలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామన్నారు. పారిశ్రామిక కాలుష్యం లేని నగరంగా హైదరాబాద్‌ను మారుస్తున్నట్లు వెల్లడించారు. ఓఆర్‌ఆర్‌ ‌వెలుపల కాలుష్య రహితంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. మాదాపూర్‌ ‌శిల్పాకళావేదికలో టీఎస్‌ఐపాస్‌ ఐదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, ‌మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి జయేశ్‌ ‌రంజన్‌, ‌పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. టీఎస్‌ఐపాస్‌ ‌సీఎం కేసీఆర్‌ ‌మానసపుత్రిక అని స్పష్టం చేశారు. పారిశ్రామిక సంఘాలు, అధికారులతో సీఎం కేసీఆర్‌ ఒక రోజంతా చర్చించి.. టీఎస్‌ ఐపాస్‌కు రూపకల్పన చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యమైన విద్యుత్‌ ‌కోసం పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోనే విద్యుత్‌ ‌సమస్యను అధిగమించాం. వ్యవసాయానికి కూడా 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణెళినని అన్నారు. కొత్త తరహా ఆలోచనలతో వచ్చే అందరికీ రాయితీలు చెల్లిస్తాం. ఒక పరిశ్రమకు రాయితీ ఇస్తే వేల మందికి ప్రయోజనం కలుగుతుంది. పరిశ్రమలకు రాయితీలు ఇస్తే పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నట్లు అపోహలు సృష్టించారు. చైనాతో పోటీ పడాలంటే సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలతో పాటు మెగా పార్కులు ఉండాలి. హైదరాబాద్‌ ‌ఫార్మాసిటీని అతి త్వరలోనే ప్రారంభించబోతున్నాం. ఫార్మా సిటీ కోసం 10 వేల ఎకరాలు సేకరించాం. ఎస్సీ, గిరిజన పారిశ్రామికవేత్తల రూ. 305 కోట్ల రాయితీలు అందజేశాం. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు కార్మికులకు జీవనాధారం. మెగా పరిశ్రమలు 30 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఎంఎస్‌ఎంఈలు 70 శాతం వరకు ఉపాధిని కల్పిస్తున్నాయి. ప్రపంచంతో పోటీ పడాలంటే భారీ ప్రాజెక్టులు ఉండాల్సిందేనిని కుండబద్దలుకొట్టారు. నిబద్ధతతో పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికే ప్రాధాన్యత ఇస్తున్నాం. పరిశ్రమల వద్దే ఉద్యోగుల నివాసాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం అని కేటీఆర్‌ ‌తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మట్లాడుతూ..ఐదు సంవత్సరాలల్లో టిఎస్‌-ఐపాస్‌ ‌సక్సెస్‌ ‌కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను చిన్నప్పుడు సైకిల్‌ ‌ద పాలు సరఫరా చేశానని..ఇప్పుడు మినిష్టర్‌ అయ్యానని తెలిపారు. పాల వ్యాపారంతో ప్రారంభమైన తన సక్సెస్‌ ‌మల్లారెడ్డి విద్యాసంస్థల వరకు వచ్చానంటే అందుకు నిదర్శనం కష్టం అన్నారు. కష్టపడితే సాధించలేనిది ఏది లేదనడానికి తానే నిదర్శమని ఆయన తెలిపారు. అందరం కలిసి పని చేసి దేశంలోనే తెలంగాణను నంబర్‌-1 ‌స్థానానికి తేవాలన్నారు. తెలుగువారికి తెలివి ఎక్కువని యువత కసిగా లక్ష్యాలను చేరుకోవాలని ఆయన సూచించారు. టిఎస్‌-ఐపాస్‌ 5 ‌సంవత్సారాలలో అబివృద్ధి చెందడానికి మంత్రి కెటిఆర్‌ ‌కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే కెటిఆర్‌పై ప్రశంశలు గుప్పించారు. ఈ సందర్భంగా పలువురుపారిశ్రామిక వేత్తలకు అవార్డులను అందచేశారు.