వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌ ‌పౌరసత్వం రద్దుపై స్టే

November 22, 2019

వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్‌ ‌చెన్నమనేని రమేశ్‌ ‌పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్రహోంశాఖ ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది.డాక్టర్‌ ‌చెన్నమనేని రమేశ్‌ ‌పౌరసత్వం రద్దు చేస్తూ రెండు రోజుల క్రితం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేయగా ఆయన ప్రత్యర్ధి,కాంగ్రెస్‌ ‌పార్టి నాయకుడు ఆది శ్రీనివాస్‌ ‌రాష్ట్ర హైకోర్టులో కెవియట్‌ ‌పిటిషన్‌ను దాఖలు చేశారు.ఇదే సమయంలో డాక్టర్‌ ‌రమేశ్‌ ‌కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని పిటిషన్‌ ‌దాఖలు చేయగా హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు విన్న తదుపరి కేంద్ర హోంశాఖ ఉత్తర్వులపై స్టే విధించింది.ఈ కేసును డిసెంబర్‌ 16‌కు వాయిదా వేసింది. దీనితో డాక్టర్‌ ‌రమేశ్‌ అనుచరులు,సహచరుల్లో ఆనందం వెల్లివిరియగా,కాంగ్రెస్‌ ‌పార్టి శ్రేణుల్లో విచారం అలుముకుంది.