వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

శతాబ్దాంతానికి మహానగరాలు మునిగి పోతాయి

December 2, 2019

ఆర్కిటిక్‌ ‌ప్రాంతంలో గ్రీన్‌ ‌లాండ్‌ ‌పొరలు 2030 నాటికి పూర్తిగా కరిగి పోతాయని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఆమెజాన్‌లో అడవుల నరికి వేత తీవ్రఆందోళన కలిగిస్తోందని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. మంచు కరిగిపోయి నీటి పరిమాణం పెరిగి పోతుందనీ, ఈ శతాబ్దాంతానికి చెన్నై, షాంఘై, ముంబాయి, న్యూయార్క్ ‌వంటి మహానగరాలు నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చరించారు.భూమి వెడెక్కుతోంది భూతాపాన్ని చల్లార్చడానికి తొమ్మిది ముఖ్యమైన సూత్రాలను శాస్త్రజ్ఞులు సూచించారు. భూమిపై వాతావ రణం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఏ క్షణంలో పరిస్థితి విషమిస్తుందో చెప్పలేని స్థితిలో ఉంది. అందుకే శాస్త్రజు్ఞ లు భూమి మీద వేడిని తగ్గించే ందుకు తగిన చర్యలు తీసుకో వాలని సూచిస్తున్నారు వాతావ రణ ఎమర్జెన్సీని ప్రకటిం చాలని పిలుపు ఇచ్చారు. భూతాపం సాధారణ స్థితి కన్నా ఎక్కువగా ఉందని జర్నల్‌ ‌నేచుర్‌ అనే మ్యాగజైన్‌లో ఒక వ్యాసం ప్రచురితం అయింది. మానవ జాతి చరిత్రలో ఇంత తీవ్ర స్థాయిలో భూతాపం లేదని శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. మానవ నాగరికతే ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని వారు హెచ్చరిస్తున్నారు. పరిశోధకులు తొమ్మిది సూత్రాలను ప్రతిపాదించారు. పశ్చిమ అట్లాంటిక్‌ ఐస్‌ ‌షీట్‌, ఈస్ట్ అట్లాంటిక్‌ ఐస్‌ ‌షీట్‌, ‌గ్రీన్‌ ‌లాండ్‌ ఐస్‌ ‌షీట్‌, అతి శీతోష్ణ స్థితి, స్లోడౌన్‌ ఇన్‌ అట్లాంటిక్‌ ‌సర్క్యలేషన్‌, ‌పగడపు దిబ్బలు కరిగి పోవడం ఆమెజాన్‌ అడవుల్లో అధిక వర్షాలు, మొదలైన పరిణామాలను శాస్త్రజ్ఞులు ఉదహరిస్తున్నారు. వాతావరణపరంగా ఎమర్జెన్సీని విధించాలని 153 దేశాలకు చెందిన 11,000 మంది శాస్త్రజ్ఞులు విజ్ఞప్తి చేశారు.
ఐక్యరాజ్య సమితి అంతర్‌‌ప్రభుత్వ బృందం(ఐపిసిసి) వాతావరణ మార్పుపై చాలా సంవత్సరాల క్రితమే కొన్ని సూత్రాలను ప్రతిపాదించింది. అయితే, ఈ శీతోష్ణ స్థితి పారిశ్రామిక స్థితికి ముందు ఐదు డిగ్రీల సెలిసియస్‌కు చేరినప్పుడే సంభవిస్తుందని అంచనా వేశారు. కానీ, ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం పెరిగిపోతోంది . దాని ప్రభావం భూగ్రహంపై తీవ్రంగా ఉంటోంది. అయితే ఈ టిప్పింగ్‌ ‌పాయింట్స్ ‌వాతావరణం ఒకటవ, రెండవ సెల్సియస్‌ ‌డిగ్రీలకు చేరుకున్నప్పుడే ఈ మాదిరి పరిస్థితి ఏర్పడుతుందని శాస్త్రజ్ఞులు ఆరేళ్ళ క్రితం అంచనా వేశారు. పారిశ్రామిక వ్యర్థాలు, అడవుల నరికివేత, జల, వాయు కాలుష్యాల వల్ల వాతావరణం బాగా దెబ్బతింటోంది. వేడిమికి మంచు కరిగి పోతోందనీ, చెట్ల నరికివేత వల్ల అమెజాన్‌ అడవుల్లో పరిస్థితి క్షీణించిందని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. శీతోష్ణ స్థితి ప్రభావం వల్ల పగడపు దిబ్బలు కరిగి పోవడంతో సాగరంలోని జీవజాలానికి రక్షణ కరువవుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. విల్కీస్‌ ‌బేసిన్‌లో తూర్పు అట్లంటిక్‌ ‌మంచు పొరలు కరిగి పోతున్నాయి. వీటి ప్రభావం వాతావరణంపై నేరుగా కనిపిస్తోంది. ఆర్కిటిక్‌ ‌ప్రాంతంలో గ్రీన్‌ ‌లాండ్‌ ‌పొరలు 2030 నాటికి పూర్తిగా కరిగి పోతాయని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఆమెజాన్‌లో అడవుల నరికి వేత తీవ్రఆందోళన కలిగిస్తోందని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. మంచు కరిగిపోయి నీటి పరిమాణం పెరిగి పోతుందనీ, ఈ శతాబ్దాంతానికి చెన్నై, షాంఘై, ముంబాయి, న్యూయార్క్ ‌వంటి మహానగరాలు నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చరించారు.