వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

శానిటరీ పోస్టులకు 7 వేల మంది ఇంజనీర్లు..!

November 30, 2019

కోయంబత్తూరు మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌లో ని పారిశుధ్య విభాగంలో   549 పోస్టులకు    ఏడువేల మంది ఇంజనీర్లు దరఖాస్తు చేశారు.  గ్రేడ్‌ -1  ‌శానిటరీ పోస్టుల కు కార్పొరేషన్‌ అధికారులు దరఖాస్తులను ఆహ్వానించారు.  ఈ  ఉద్యోగాల కోసం  నిర్వహించిన ఇంటర్వ్యూలకు  ఏడువేల మంది ఇంజనీర్లు హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఇంటర్వ్యూలు,  యోగ్యతా పత్రాల ధ్రువీకరణ జరిగింది. ఈ ఇంటర్వ్యూలు బుధవారం ప్రారంభమయ్యాయి.   ఈ ఉద్యోగాలకు విద్యార్హత    ఎస్‌ఎస్‌ఎల్‌ ‌సి అనీ,  ఈ ఉద్యోగాల కు దరఖాస్తు చేసిన వారిలో    70 శాతం మంది  ఇంజనీర్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు,  డిప్లొమా హోల్డర్లు ఉన్నరని కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు.  దరఖాస్తు దారుల్లో కొందరు ఇప్పటికే ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్నట్టు వారి దరఖాస్తుల పరిశీలనలో తేలిందని   అధికారులు తెలిపారు., ఈ  ఈ పోస్టుకు వేతనం 15, 700 అని వారు చెప్పారు.  కాంట్రాక్టు పద్దతిపై పదేళ్ళ నుంచి శానిటరీ పోస్టుల్లో  పని చేస్తున్నవారున్నారనీ, తమ ఉద్యోగాలను ఖాయం చేయాలని వారు కోరుతున్నారని అధికారులు తెలిపారు.