వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

శ్రీవాణి టెక్నో స్కూల్‌ ‌లో… ‘వాటర్‌ ‌బెల్‌’

November 21, 2019

‌శ్రీవాణి టెక్నో స్కూల్‌ ‌లో గురువారం విద్యార్థులకు నీటి ప్రాముఖ్యత పై గురువారం అవగాహన కార్యక్రమంనిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ ‌సి.హెచ్‌. ‌సత్యం మాట్లాడుతూ.. విద్యార్థులు ఎటువంటి అనారోగ్య గురి కాకుండా ఉండడానికి నీరు నిత్యజీవితంలో చాల వరకు తోడ్పడుతుం దన్నారు. డాక్టర్లు, యోగా గురువులు సైతం నీటి ప్రాముఖ్యత గురించి తెలిపారని, విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన అంశాలు అమలులో పాఠశాల ఎప్పుడు ముందుంటుందన్నారు. అందులో భాగంగా వాటర్‌బెల్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. నీటిని విద్యార్థులు రాగి, స్టీల్‌ ‌బాటిల్‌ ‌లో తాగే విధంగా చూస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ ‌కృపాకర్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.