వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

షాద్‌నగర్‌ ‌పీఎస్‌కు సంకెళ్ళు..!

December 1, 2019

ప్రజాతంత్ర, షాద్‌నగర్‌ : ‌ప్రియాంకరెడ్డి హత్యకు కారకులైన నిందుతులను తక్షణమే ఉరితీయాలని వందల సంఖ్యలో నిరసనకారులు షాద్‌నగర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌వద్దకు చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పీఎస్‌ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది. అయితే ఏమాత్రం వెనక్కి తగ్గని నిరసనకారులు పోలీస్‌ ‌స్టేషన్‌ ‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. స్టేషన్‌ ‌గేటును మూసేశారు. గేటుకు వేయడానికి తాళాలు లేకపోవడంతో… దానికి బేడీలు వేశారు. పీఎస్‌ ‌గేటుకు బేడీలు వేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.