వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

సంగీతాన్ని పోగొట్టుకోవద్దు

November 12, 2019

ఆదివాసీ తెగలకు ఆశ్వాసన ఇవ్వాలి: గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌‌స్టేట్‌ ఆర్ట్ ‌గేలరీ ‘ఆదిధ్వని’ జానపద గిరిజన 124 సంగీతవాద్యాల ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ ‌డా।। తమిళిసై సౌందరరాజన్‌ ‌సందర్శించారు. ప్రదర్శనకు ఉంచిన 124 వాద్యాలను ఒక్కొక్క వాద్యాన్ని చూసి వివరాలు తెలుసుకుంటూ వాటిని వాయిస్తూ ఉత్సాహంగా కలయదిరిగారు. గవర్నర్‌ ఈసందర్భంగామాట్లాడుతూ.. ఆదివాసీ జీవితాలకు, కళా సాంస్క•తిక రంగానికి చేయూత నివ్వవలసిన సమయం ఆసన్నమైందని, జానపద, గిరిజన ప్రాచీన వాద్యాలను బతికించడం అత్యవసరమైన కాలంలో ఇలాంటి సేకరణ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుందని తెలిపారు. లేని పక్షంలో ఈసంగీతవాద్యాలు, గానరీతులు, రాగాలు అన్నీ అంతరించిపోతున్నాయని అన్నారు. ప్రత్యేక దృష్టి సారించి వారికి చేయూతనందిచాలి అన్నారు. వైవిధ్యభరితమైన దేశీయ సంగీతాన్ని కాపాడుకోకపోతే అది కాలగర్భంలో కలసిపోతుందని, అందుకే ‘ఆదిధ్వని’ వారు సేకరించిన వందలాది వాద్యాలను ప్రదర్శనలో ఉంచేందుకు తనకు చేతనైనంత సహాయం చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. త్వరలో ఆదిధ్వని నిర్వాహకులతో సమావేశం ఏర్పాటుచేసి మ్యూజియం ఏర్పాటు గురించి చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ వాద్య ప్రదర్శనలు చూసి తాను ఎంతో ఆశ్యర్యానికి గురయ్యానని అన్నారు. తదుపని రుంజ, తోటి బుర్రవాద్యం, కిక్రి, కోయడోలు కళాకారులను సన్మానించారు ఈసభలో వాద్యాల సేకరణ కర్త జయధీర్‌తో మలపు పాటు పొట్లపల్లి వరప్రసాదరావు, డా।। సాయిబాబా గౌడ్‌ ‌పాల్గొన్నారు. సభకు ఆచార్య గూడూరు మనోజ అధ్యక్షత వహించారు.