వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

సోషల్ మీడియా ప్రభావం… స్వయం నియంత్రణే ఏకైక మార్గం

August 9, 2019

సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు సామాజిక మార్పులు సామాజిక ప్రయోజనానికి ఉపయోగ పడాలే తప్ప సామాజిక విధ్వంసానికి ఆజ్యం కాకూడదని తెలంగాణ మాజీ మంత్రి , సిద్దిపేట శాసనసభ్యులు తన్నీర్ హరీష్ రావు రెండు రోజుల క్రితం ఒక సమావేశంలో విద్యార్ధులకు ఇచ్చిన సందేశం ఎంతో ఉదాత్తమైనది. సోషల్ మీడియా… సామాజిక మాధ్యమాల విస్తృతి మొబైల్ ఫోన్ల వినియోగంతో పాటు బాగా పెరిగింది . గతంలో టెలిఫోన్ అంటే స్టేటస్ సింబల్, ఉన్నతాదాయ వర్గాలు మత్రమే ఫోన్ కలిగి ఉండేవారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణల కొనసాగింపుగా టెలికమ్యూనికేషన్ రంగంలో కూడా సంస్కరణలు వచ్చాయి. ప్రైవేటు రంగం చేతుల్లోకి టెలికమ్యూనికేషన్ రంగం వెళ్ళింది. దీని వల్ల లాభాలు ఉన్నట్టే, నాణానికి రెండో వైపు కూడా ఉంది. టెలికమ్యూనికేషన్ రంగం పూర్తిగా ప్రభుత్వ అధీనంలో ఉన్నప్పుడు ల్యాండ్ ఫోన్ కోసం దరఖాస్తు చేస్తే మూడేళ్ళయినా వచ్చేది కాదు. మొబైల్ ఫోన్ ల విప్లవం వచ్చిన తర్వాత ఎప్పుడంటే అప్పుడు,ఎక్కడంటే అక్కడ ఫోన్లు, సిమ్ కార్డులు దొరుకుతున్నాయి. మారుమూల గ్రామాల్లో నిరక్షరాస్యుల చేతులలో కూడా మొబైల్ ఫోన్ లు కనిపిస్తున్నాయి. సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసుకోవడానికి మొబైల్ ఫోన్ లు ఎంతో ఉపయోగ పడుతున్నాయి. మొబైల్ ఫోన్ లు మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దేందుకు స్మార్ట్ ఫోన్ లను ప్రైవేటు టెలికాం కంపెనీల వాళ్ళు ప్రవేశపెట్టారు.ఇవి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేవి, ఇప్పటికీ ఉంటున్నాయి. అయితే, స్మార్ట్ ఫోన్ లు వచ్చిన తర్వాత సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగింది. మొబైల్ ఫోన్ లలో అంతర్జాలం సహాయంతో ఎప్పటికప్పుడు జరిగిన ఘటనల దృశ్యాలను ప్రజలు చూడగలుగుతున్నారు రైలు, విమాన ప్రమాదాల దృశ్యాలు కానీ, ముఖ్యమైన ఘటనలకు సంబంధించిన దృశ్యాలు కానీ, ఫోన్ వినియోగదారుల ముందు క్షణాల్లో ప్రత్యక్ష మవుతున్నాయి. టెలిసాంకేతిక రంగంలో ఇది పెను విప్లవం. స్మార్ట్ ఫోన్ లు ఇప్పుడు అందరి చేతుల్లో కనిపిస్తున్ని. కార్లు, బస్సులు, రైళ్ళు, ఆటోలు అన్ని ప్రయాణ సాధనాల్లో, ప్రయాణీకుల చేతుల్లో స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. బస్సుల్లో పక్కపక్కన కూర్చున్న ప్రయాణీకులు వేర్వేరు చానల్స్ చూడగలుగుతున్నారు. నిజంగా ఇది ఘనమైన అభివృద్ధి. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు సామాజిక మార్పులు సామాజిక ప్రయోజనానికి ఉపయోగ పడాలే తప్ప సామాజిక విధ్వంసానికి ఆజ్యం కాకూడదని తెలంగాణ మాజీ మంత్రి , సిద్దిపేట శాసనసభ్యులు తన్నీర్ హరీష్ రెండు రోజుల క్రితం ఒక సమావేశంలో విద్యార్ధులకు ఇచ్చిన సందేశం ఎంతో ఉదాత్తమైనది. యువకులపై సామాజిక మాధ్యమాల ప్రభావం కారణంగానే ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, చిన్న తగాదాలకే ఘర్షణలు జరగడం, చివరికి అవి హత్యలకు దారితీయడం ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతోంది. యువకుల ప్రమేయం ఉన్న నేరాల సంఖ్య పెరగడానికి ఇదే ముఖ్య కారణం. ఆడపిల్లలు కూడా సామాజిక మాధ్యమాల ప్రభావంతో యువకుల కపట ప్రేమ వలలో పడుతున్నారు. తెల్లవారి లేస్తే టీవీ చానల్స్ లో రోజుకో యువతి, లేదా విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మనకు దర్శనమిస్తాయి. పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు మాత్రమే విద్యార్ధినీ, విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు గతంలో ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు ప్రేమ వైఫల్యం, లేదా మోసాలకు గురి కావడం వల్ల జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు తల్లితండ్రులకు గుండె కోతను మిగులుస్తున్నాయి. ముక్కుపచ్చలారని వయసులోనే ప్రేమలో పడటం కూడా సామాజిక మాధ్యమాల ప్రభావం కారణంగానేనని వేరే చెప్పనవసరం లేదు. రోజుకో హత్య, పూటకో రేప్ సర్వసాధారణం అయింది. రాయడానికి అనువు కాని భాషలో బూతు కథలే కాదు, చూడకూడని దృశ్యాలు గల షార్ట్ ఫిలింలను యువత చూస్తున్నారు. చదువుతున్నారు. దీంతో బంగారు భవిష్యత్ ను చేజేతులా పాడు చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమైన వాట్ అప్, ఫేస్ బుక్ వంటివి కూడ దుర్వినియోగం అవుతున్నాయి. వీటిని తల్లితండ్రులు ఎవరూ పట్టించుకోవడం లేదు. పట్టించుకున్నా వారుచేయగలిగింది ఏమీ లేదు. అయితే , అందరూ ఈ సౌకర్యాలను దుర్వినియోగం చేయడం లేదు. మంచి కన్నా, చెడు ఎక్కువ వేగంగా వ్యాపిస్తుందన్న నానుడి లా ఎక్కువ మంది సామాజిక మాధ్యమాల ప్రభావానికి గురి అవుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో సామాజిక మాధ్యమాల బారి నుంచి యువతీ యువకులు బయటపడేందుకు స్వయం నియంత్రణే తప్ప వేరే మార్గం లేదు. స్కరణల కొనసాగింపుగా టెలికమ్యూనికేషన్ రంగంలో కూడా సంస్కరణలు వచ్చాయి. ప్రైవేటు రంగం చేతుల్లోకి టెలికమ్యూనికేషన్ రంగం వెళ్ళింది. దీని వల్ల లాభాలు ఉన్నట్టే, నాణానికి రెండో వైపు కూడా ఉంది. టెలికమ్యూనికేషన్ రంగం పూర్తిగా ప్రభుత్వ అధీనంలో ఉన్నప్పుడు ల్యాండ్ ఫోన్ కోసం దరఖాస్తు చేస్తే మూడేళ్ళయినా వచ్చేది కాదు. మొబైల్ ఫోన్ ల విప్లవం వచ్చిన తర్వాత ఎప్పుడంటే అప్పుడు,ఎక్కడంటే అక్కడ ఫోన్లు, సిమ్ కార్డులు దొరుకుతున్నాయి. మారుమూల గ్రామాల్లో నిరక్షరాస్యుల చేతులలో కూడా మొబైల్ ఫోన్ లు కనిపిస్తున్నాయి. సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసుకోవడానికి మొబైల్ ఫోన్ లు ఎంతో ఉపయోగ పడుతున్నాయి. మొబైల్ ఫోన్ లు మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దేందుకు స్మార్ట్ ఫోన్ లను ప్రైవేటు టెలికాం కంపెనీల వాళ్ళు ప్రవేశపెట్టారు.ఇవి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేవి, ఇప్పటికీ ఉంటున్నాయి. అయితే, స్మార్ట్ ఫోన్ లు వచ్చిన తర్వాత సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగింది. మొబైల్ ఫోన్ లలో అంతర్జాలం సహాయంతో ఎప్పటికప్పుడు జరిగిన ఘటనల దృశ్యాలను ప్రజలు చూడగలుగుతున్నారు రైలు, విమాన ప్రమాదాల దృశ్యాలు కానీ, ముఖ్యమైన ఘటనలకు సంబంధించిన దృశ్యాలు కానీ, ఫోన్ వినియోగదారుల ముందు క్షణాల్లో ప్రత్యక్ష మవుతున్నాయి. టెలిసాంకేతిక రంగంలో ఇది పెను విప్లవం. స్మార్ట్ ఫోన్ లు ఇప్పుడు అందరి చేతుల్లో కనిపిస్తున్ని. కార్లు, బస్సులు, రైళ్ళు, ఆటోలు అన్ని ప్రయాణ సాధనాల్లో, ప్రయాణీకుల చేతుల్లో స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. బస్సుల్లో పక్కపక్కన కూర్చున్న ప్రయాణీకులు వేర్వేరు చానల్స్ చూడగలుగుతున్నారు. నిజంగా ఇది ఘనమైన అభివృద్ధి. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు సామాజిక మార్పులు సామాజిక ప్రయోజనానికి ఉపయోగ పడాలే తప్ప సామాజిక విధ్వంసానికి ఆజ్యం కాకూడదని తెలంగాణ మాజీ మంత్రి , సిద్దిపేట శాసనసభ్యులు తన్నీర్ హరీష్ రెండు రోజుల క్రితం ఒక సమావేశంలో విద్యార్ధులకు ఇచ్చిన సందేశం ఎంతో ఉదాత్తమైనది. యువకులపై సామాజిక మాధ్యమాల ప్రభావం కారణంగానే ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, చిన్న తగాదాలకే ఘర్షణలు జరగడం, చివరికి అవి హత్యలకు దారితీయడం ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతోంది. యువకుల ప్రమేయం ఉన్న నేరాల సంఖ్య పెరగడానికి ఇదే ముఖ్య కారణం. ఆడపిల్లలు కూడా సామాజిక మాధ్యమాల ప్రభావంతో యువకుల కపట ప్రేమ వలలో పడుతున్నారు. తెల్లవారి లేస్తే టీవీ చానల్స్ లో రోజుకో యువతి, లేదా విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మనకు దర్శనమిస్తాయి. పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు మాత్రమే విద్యార్ధినీ, విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు గతంలో ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు ప్రేమ వైఫల్యం, లేదా మోసాలకు గురి కావడం వల్ల జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు తల్లితండ్రులకు గుండె కోతను మిగులుస్తున్నాయి. ముక్కుపచ్చలారని వయసులోనే ప్రేమలో పడటం కూడా సామాజిక మాధ్యమాల ప్రభావం కారణంగానేనని వేరే చెప్పనవసరం లేదు. రోజుకో హత్య, పూటకో రేప్ సర్వసాధారణం అయింది. రాయడానికి అనువు కాని భాషలో బూతు కథలే కాదు, చూడకూడని దృశ్యాలు గల షార్ట్ ఫిలింలను యువత చూస్తున్నారు. చదువుతున్నారు. దీంతో బంగారు భవిష్యత్ ను చేజేతులా పాడు చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమైన వాట్ అప్, ఫేస్ బుక్ వంటివి కూడ దుర్వినియోగం అవుతున్నాయి. వీటిని తల్లితండ్రులు ఎవరూ పట్టించుకోవడం లేదు. పట్టించుకున్నా వారుచేయగలిగింది ఏమీ లేదు. అయితే , అందరూ ఈ సౌకర్యాలను దుర్వినియోగం చేయడం లేదు. మంచి కన్నా, చెడు ఎక్కువ వేగంగా వ్యాపిస్తుందన్న నానుడి లా ఎక్కువ మంది సామాజిక మాధ్యమాల ప్రభావానికి గురి అవుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో సామాజిక మాధ్యమాల బారి నుంచి యువతీ యువకులు బయటపడేందుకు స్వయం నియంత్రణే తప్ప వేరే మార్గం లేదు.

అనంత పద్మనాభ స్వామి చల్లా