వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‘‌దిశ’కు ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టు

December 4, 2019

మహబూబ్‌నగర్‌లో అనుమతిచ్చిన హైకోర్టు..
ఏడు రోజులు పోలీసుల కస్టడి
జిల్లా కోర్టు సెషన్స్ ‌జడ్జిని నియమిస్తూ ఉత్తర్వులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసుని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో నిందితులను వీలైనంత త్వరగా కఠినంగా శిక్షించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టు ఏర్పాటుకోసం చర్యలు చేపట్టింది. ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టు ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ ‌ప్రభుత్వం హైకోర్టుకి లేఖ రాసింది. ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టు ద్వారా విచారణ త్వరగా పూర్తిచేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం కోరింది. ఫాస్ట్ ‌ట్రాక్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వం తరఫున న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌ ‌రెడ్డి హైకోర్టుకి లేఖ రాశారు. ఇదిలా ఉంటే దిశ కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ ‌కోర్టు ఏర్పాటుపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టు ఏర్పాటుకు సమ్మతిస్తూ న్యాయస్థానం ప్రభుత్వానికి సమాచారమిచ్చింది. మహబూబ్‌నగర్‌లో ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టు ఏర్పాటు చేయనుంది. మహబూబ్‌నగర్‌ ‌జిల్లా కోర్టు సెషన్స్ ‌జడ్జిని నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా కోర్టుకు స్పెషల్‌ ‌కోర్టు •దా ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బుధవారం రాత్రి వరకు నిందితులను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కస్టడీకి ఇస్తే… కోర్టులోనే ఐడెంటిటీ పరేడ్‌ ‌నిర్వహించి వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా విచారించే అవకాశం ఉందని సమాచారం. దిశ నిందితులు ప్రస్తుతం చర్లపల్లిలో జైల్లో ఉన్నారు. అటు దిశ నిందితుల కస్టడీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిందితుల భద్రతపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కస్టడీకి ఇస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అఫెన్స్‌కు వెళ్లలేని పరిస్థితి ఉంది. నిందితులను మాకు వదిలేయండి, చంపేస్తామంటూ ప్రజలు ఆందోళనలు చేస్తుండడంతో వారి భద్రత ఎలా అని పోలీసుల టెన్షన్‌ ‌పడుతున్నారు. చర్లపల్లి జైలు దగ్గర టెన్షన్‌ ‌వాతావరణం ఉంది.