వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‌ప్రధానికి లేక రాసిన ప్రముఖులపై కేసు

October 4, 2019

ముజఫర్‌పూర్‌లో నమోదు చేసిన పోలీసులు
మండిపడ్డ ఆదూరి గోపాలకృష్ణన్‌

‌ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసిన 49 మంది ప్రముఖులపై బీహార్‌లో కేసు నమోదైంది. ఈ జాబితాలో చరిత్రకారుడు రామచంద్ర గుహ, సినీ ప్రముఖులు మణిరత్నం, రేవతి, అపర్ణాసేన్‌ ‌తదితరులు ఉన్నారు. చీఫ్‌ ‌జుడీషియల్‌ ‌మెజిస్ట్రే ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్టు ముజఫర్పూర్‌ ‌పోలీసులు తెలిపారు. సమాజంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తు న్నారంటూ.. న్యాయవాది సుధీర్‌ ఓజా స్థానిక కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. పిటిషన్‌ ‌విచారణ అనంతరం ఆగస్ట్ 20‌న తుది తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా లేఖలో సంతకాలు చేసిన అందరిపై ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయాలంటూ మెజిస్ట్రే ఆదేశాలు జారీ చేశారు. మూకదాడులకు పాల్పడడం, దాడుల సందర్భంగా జైశ్రీరామ్‌ ‌నినాదాన్ని వినియోగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ 49 మంది ప్రముఖులు ఈ ఏడాది జులైలో ప్రధానికి లేఖ రాశారు. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ఈ విషయాన్ని ప్రస్తావించినా.. సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని లేఖలో పేర్కొన్నారు. అప్పట్లో ఈ లేఖ సంచలనమైంది. అయితే దీనికి కౌంటర్‌గా మరో 62మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రధానికి మరో లేఖ రాశారు. రాజకీయ కోణంలో.. పక్షపాత ధోరణితో మణిరత్నం వంటి ప్రముఖులు లేఖ రాశారని ఆరోపించారు. కౌంటర్‌ ‌లేఖ రాసిన వారిలో కంగనా రనౌత్‌, ‌మధుర్‌ ‌బండార్కర్‌, ‌ప్రసూన్‌ ‌జోషి తదితరులు ఉన్నారు.ఇదిలావుంటే ముజఫరాపూర్‌ ‌జిల్లాలో కేసు నమోదు కావడం సంచలనమవుతోంది. దీనిపై ప్రముఖ దర్శకనిర్మాత అదూర్‌ ‌గోపాలకృష్ణన్‌ ‌తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లేఖలో సంతకాలు చేసిన అదూర్‌తో సహా మొత్తం 49 మందిపై ముజఫరాపూర్‌ ‌పోలీసులు శుక్రవారంనాడు కేసు నమోదు చేశారు. దీనిపై అదూర్‌ ‌మాట్లాడుతూ, దేశంలో అసాధారణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. గాంధీజీని చంపిన నాథూరాం గాడ్సేని స్మరించుకుంటూ మనదేశంలోనే గాంధీజీ నమూనాపై ఒక మహిళతో సహా పలువురు కాల్పులు జరిపినట్టు విన్నాం. అలాంటి వారిపై ఏ కోర్టూ కేసు నమోదు చేయదు. ఇప్పుడు అదే వ్యక్తి పార్లమెంటు సభ్యుడు కూడా అని అదూర్‌ ‌తెలిపారు. దేశంలో జరుగుతున్న ఘటనలపై భయాలు వ్యక్తం చేస్తూ రాసిని లేఖ ఆధారంగా పిటిషన్‌ ‌వేస్తే ఏ కోర్టు అయినా దానిని విచారణకు స్వీకరించవచ్చా? కేసు నమోదు వార్తే నిజమైతే, న్యాయవ్యవస్థను అనుమానించాల్సి వస్తుందని ఆయన అన్నారు.