వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‌ప్రశాంతంగా ముగిసిన మొదటిదశ పోలింగ్‌

May 8, 2019

‌పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ ‌శ్రీదేవసేనజిల్లాలో స్థానిక సంస్థల మొదటి దశ ఎన్నికల పోలింగ్‌ ‌ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్‌ ‌శ్రీదేవసేన తెలిపారు. జిల్లాలోని 7 మండలాల పరిధిలోని 7 జడ్పీటిసి, 69 ఎంపిటిసి స్థానాలకు మొదటి దశ పోలింగ్‌ ‌నిర్వహించారు. 7 మండలాల్లో 366 పోలిం గ్‌ ‌కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ ‌జరిగింది. మొదటి దఫా ఎన్నికల్లో 1,87,518 మంది తమ ఓటు హక్కు విని యోగించుకోవాల్సి ఉండగా 1,43,050 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆమె తెలి పారు. జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో 76.29% పోలింగ్‌ ‌నమోదైంది. అంతర్గాం మండలం లో 76.8%, మంథని మండలంలో 77.85%, ముత్తా రం 77.12%, రామగిరి మండలం 71.10%, కమాన్‌పూర్‌ ‌మండలం 81.73% , ధర్మారం మండలం 76.06%, పాలకుర్తి 76.29% మొత్తం మీద మొదటి దశలో 76.29% పోలింగ్‌ ‌నమోదు .