వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‘‌రెండోదశ ప్రాదేశిక’ పోలింగ్‌ ‌ప్రశాంతం

May 10, 2019

1850 ఎంపీటీసీ స్థానాల్లో వోటు హక్కును వినియోగించుకున్న ప్రజలు

తెలంగాణలోని రెండవ విడత జిల్లా పరిషత్‌, ఎం‌పీటీసీ స్థానాలకు ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. చిన్నచిన్న అవాంఛనీయ సంఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి ఘర్షణలు లేకుండా పోలింగ్‌ ‌సజావుగా సాగింది. ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ ‌కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎండల వేడిమి ఎక్కువగా ఉండటంతో ఉదయాన్నే తమ ఓటును వినియోగించుకొనేందుకు ఓటర్లు కేంద్రాల వద్దకు అధిక సంఖ్యలో చేరుకున్నారు.