వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‌రైతులు, పేద ప్రజల జీవితాలు చిన్నాభిన్నం

May 10, 2019

ఇచ్చిన ప్రతిహాని విస్మరించారు
బడా వ్యాపార వేత్తలకు మాత్రమే మోడీ ప్రధాని : ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్‌ ‌నేత ప్రియాంకా గాంధీ

ఐదేళ్ల ఎన్డీయే పాలనలో ప్రధాని మోదీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హాని విస్మరించి దేశ ప్రజలను మోసం చేశాడని కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విమర్శించారు. సార్వత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్ద్‌నగర్‌లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాఅవగాహన చాలా అవసరం అని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. నేతలు చేస్తున్న వాగ్ధానాలను ప్రజలు పరిశీలించాలన్నారు. అవి ఎంత వరకు నిజమో.. కాదో తెలుసుకోవాలన్నారు.

గతంలో ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేసారా లేదా అని ప్రజలు ఆరా తీయాలన్నారు. ప్రతి ఒకరి అకౌంట్‌లో 15 లక్షలు వేస్తామని అయిదేళ్ల క్రితం మోదీ హా ఇచ్చారని, ఒక్కరి ఎకౌంట్‌లోనైనా పడ్డాయా అంటూ ప్రశ్నించారు. రూ.15లక్షలు అటుండి జీఎస్టీ, నోట్ల రద్దుతో మధ్య, పేద తరగతి ప్రజల జీవితాలను మోదీ చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. చిన్నచిన్న వ్యాపారులను జీఎస్టీ, నోట్ల రద్దు పేరుతో రోడ్డున పడేశారని, బడా వ్యాపారులు మాత్రం తమ వ్యాపారాలను మరింత వృద్ధిచేసుకొనేలా ప్రధాని పాలన సాగించారని అన్నారు. ప్రధాని మోదీ కేవలం బడా వ్యాపార వేత్తలకు ప్రధానిగా పాలన సాగించారని ప్రియాంకగాంధీ విమర్శలు గుప్పించారు.