వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‌సేవ్‌ ఆర్టీసీ

October 9, 2019

సేవ్‌ ఆర్టీసి దిశగా ఉద్యమించేందుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. ఈ విషయమై బుధవారం రాష్ట్ర రాజధానిలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపట్ల ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. నిరంకుశంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును వారు దుయ్యబట్టారు. కార్మికుల న్యాయమైన కోర్కెలను సామరస్యపూర్వకంగా పరిష్కారించాల్సిన ప్రభుత్వం వారిని మాజీఉద్యోగులుగా గుర్తిస్తామనడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. దీనిపైన ఎంతవరకైనా పోరాటానికి తాము సిద్దమేనంటు ఆ పక్షాలు ప్రకటించాయి. రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను ప్రజలందరికీ తెలియజెప్పేందుకు త్వరలో రాష్ట్ర బంద్‌ ‌చేపట్టేందుకు టిఎస్‌ ఆర్టీసి కార్మిక సంఘాల జాక్‌ ‌నిర్ణయించింది. కాగా కార్మికుల సమ్మెకు ఆలిండియా కార్మిక సంఘాలు (ఏఐటియుసి)కూడా మద్దతు ప్రకటించింది. కాగ•,సింగరేణి కార్మికులు కూడా తమ మద్దతును ప్రకటిస్తూ, నల్లబ్యాడ్జీలు ధరించి ఈ రోజు విధులకు హాజరైనారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలుకూడా తమ సంఘీభావాన్ని తెలిపాయి. తాజాగా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌కు మద్దతిస్తామన్న సిపిఐ కూడా ఈ విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోని పక్షంలో తమ మద్దతుపై పునరాలోచిస్తామని ప్రకటించింది. దీంతో ఆర్టీసి కార్మిక సమ్మె రోజురోజుకు మరింత ఉధ••తంగా మరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలన్న ప్రధానడిమాండ్‌తో పాటు మరికొన్ని ఇతరడిమాండ్లతో టిఎస్‌ఆర్టీసి చేపట్టినఆందోళన చివరకు ఈనెల అయిదవతేదీనుండి సమ్మెగామారింది. నేటికి ఆరురోజులుగా సమ్మె కొనసాగుతుండగా రాష్ట్ర ప్రభుత్వం కార్మికసంఘాల డిమాండ్‌పై స్పందించకపోగా కార్మికవ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంపై కార్మిక సంఘాలతో పాటు, ప్రతిపక్షాలుకూడా భగ్గుమంటున్నాయి. టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటినుండి ప్రతీవిషయంలో ఒంటెద్దుపోబడితోనే పోతుందని ఆందోళన చేస్తున్న ప్రతిపక్షాలకు ఇది అందివచ్చిన అవకాశంగామారింది. వాస్తవంగా కార్మికులు సమ్మెకు పోవడం, రాష్ట్ర ప్రభుత్వం చర్చలద్వారా వాటిని పరిష్కరించకుండా పంతానికిపోవడం సమ్మెకు దారితీసింది. సమ్మె చేస్తున్న కార్మికులందరికీ రాష్ట్రప్రభుత్వం కటాఫ్‌ ‌తేదీ సమయం ప్రకటించినప్పటికీ వారినుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో సమ్మెలో పాల్గొన్న కార్మికులంతా ఉద్దేశ్యపూర్వకంగా స్వచ్చందంగా తమ ఉద్యోగాలను వదులుకున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించి, ప్రత్యామ్నాయఏర్పాట్లను ప్రారంభించింది. సమ్మెలోపాల్గొనని పన్నెండు వందల మంది ఉద్యోగులే ఆర్టీసి ఉద్యోగులని ప్రకటించిన ప్రభుత్వం పదిహేనురోజుల్లో అర్హులైన వారిని ఉద్యోగాల్లో తీసుకునేందుకు నోటిఫికేషన్‌ ‌జారీచేసేందుకు కసరతు చేస్తోంది. దీంతో కార్మికుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఒకపక్క గతనెల వేతనాలుకూడా అందుకోలేకపోయిన వీరిని ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించనని ప్రకటించడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఆర్టీసిని ప్రైవేటుపరం చేసేందుకు మొదటినుండి ఒకపథకంప్రకారమే దాన్ని నిర్వీర్యంచేస్తూవస్తున్నదని కార్మికసంఘాలతోపాటు, రాజకీయ పార్టీల నాయకులు విరుచుకుపడు తున్నారు. దాదాపు ఏడువేలమంది కార్మికులు పదవీవిరమణచేస్తే వారిస్థానాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తవారిని ఉద్దేశ్యపూర్వకంగానే తీసుకోలేదని వారు ఆరోపిస్తు న్నారు. ఇప్పటికే సంస్థకు చెందిన కొన్ని ఆస్తులను ప్రైవేటువారికి చౌకగా కట్టబెట్టిందని, ఇప్పుడు సంస్థలో యాభై శాతం అద్దె బస్సులను నడుపుతామని ప్రకటించడంవెనుక కుట్రదాగిఉందంటున్నారు. తెలంగాణ ఏర్పడినప్పటినుండి ఇక్కడప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఆదర్శవంతమైనవిగా పేరొచ్చాయని చెప్పుకునే ముఖ్యమంత్రి పక్కరాష్ట్రాన్ని చూసైనా తనవిధానాన్ని మార్చుకోవాలని కార్మికులు, విపక్షాలు పేర్కొంటున్నారు. పాలనలో పెద్దగా అనుభవంలేకున్నా అధికారంచేపట్టిన తర్వాత ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో ఏమాత్రం మాట తప్పని ఏపి ముఖ్యమంత్రి జగన్‌ను చూసి నేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. ఎన్నికలకుముందు ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనంచేస్తానని ఇచ్చినహామీమేరకు జగన్‌ ఇటీవలనే తన మాట నిలబెట్టుకున్నాడన్నారు. కాని, తెలంగాణ ముఖ్యమంత్రి ఆర్టీసి ఉద్యోగుల వేతనాల విషయంలో జాలిచూపించి, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులతో సమానవేతనాలిస్తానని హామీఇచ్చి, ఇప్పుడున్నఉద్యోగాలనే ఊడగొడుతాననడం ఎంతవరకు సమసం జసమంటున్నారు. ఏపిఆర్టీసి ఆరువేలకోట్లకుపైగా నష్టాలతోఉన్నప్పటికీ జగన్‌ ‌సాహాసోపేత నిర్ణయం తీసుకున్నాడంటూ ప్రశంసిస్తున్నారు. మరోపక్క గ్రామ సచివాలయాల ఏర్పాటుపేర వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించిన జగన్‌ ‌తాజాగా వొచ్చే జనవరి ఒకటవ తేదీనుండి ముప్పె•వ తేదీవరకు ప్రతీఏటా ప్రభుత్వంలోని అన్నిఖాళీలను భర్తీచేసే నిర్ణయం తీసుకున్నాడని, తెలంగాణలో ఇలాంటి ప్రకటనకోసం నిరుద్యోగులు ఎంతోకాలంగా కళ్ళు కాయలుకాసేట్లుగా ఎదురు చూస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇవ్వాళ ఏపి తీసుకుంటున్న నిర్ణయాలను అమలు పర్చేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాలుకూడా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రానికి పరిశ్రమలను ఆహ్వానించినప్పుడు స్థానికులకు డెబ్బై అయిదుశాతం ఉద్యోగాలివ్వాలని జగన్‌ ‌షరతు విధించడం అన్ని రాష్ట్రాల ప్రజలను ఆకర్షించింది. దీన్నిచూసి కర్ణాటకసర్కార్‌కూడా అక్కడ పరిశ్రమలునెలకల్పే విషయంలో అంతేశాతం ఉద్యోగాలను స్థానికులకు కల్పించేవిధ•ంగా ప్రకటించింది. తాజాగా మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా అక్కడి కాంగ్రెస్‌ ‌మరో అయిదు శాతం పెంచి ఎనభైశాతం కోటా అమలుకు ప్రకటించింది. స్థానికులకు ఉద్యోగాలు కల్పించేవిషయంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటే, ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి ఉద్యోగులను రోడ్డుపైన పడేస్తానంటూ రాష్ట్రప్రభుత్వం ప్రకటించడాన్ని వారు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. దీనిపై పోరాటానికి ఎంతవరకైనా సిద్దమేనంటున్నాయి ఆ వర్గాలు.