వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

13‌న టెన్త్ ‌పలితాల విడుదల

May 10, 2019

తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. ఈనెల 13న తెలంగాణ టెన్త్ ‌ఫలితాలు విడుదలకానున్నాయి. సోమవారం ఉదయం ఫలితాలు విడుదల చేయనున్నారు. సచివాలయంలోని డీ-బ్లాక్‌ ‌గ్రౌండ్‌ ‌ప్లోర్‌లో విద్యాశాఖ అధికారులు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఉదయం 11.30గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇటీవల వెలువడిన ఇంటర్‌ ‌ఫలితాల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో పదో తరగతి ఫలితాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఫలితాల పక్రియను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే విడుదల చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.