వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

15‌కల్లా పూర్తి వివరాలు ఇవ్వండి

May 8, 2019

ఇంటర్మీడియట్‌ ‌ఫలితాలపై హైకోర్టుఇంటర్మీడియెట్‌ ‌ఫలితాలపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఫెయిల్‌ అయిన 3.28 లక్షల మంది అభ్యర్థులకు సంబంధించిన రీవెరిఫికేషన్‌, ‌రీకౌంటింగ్‌ ఇం‌కా పూర్తి కాలేదని ఇంటర్మీడియెట్‌ ‌బోర్టు హైకోర్టుకు తెలిపింది. పూర్తి వివరాలు సమర్పించడానికి మరోవారం రోజుల సమయం కావాలని అడ్వొకేట్‌ ‌జనరల్‌ ‌రామచందర్‌రావు ఈ సందర్భంగా కోర్టును కోరారు. దీంతో స్పందించిన న్యాయస్థానం ఈనెల 15వ తేదీ వరకు పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల15వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు గ్లోబరీనా టెక్నాలజీ సంస్థను కూడా ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్‌. ‌కాగా ఈ నెల 10వ తేదీన ఫలితాలను విడుదల చేస్తామని ఇంటర్‌ ‌బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.