వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

30 ‌రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయుటకు.. నిబద్ధతతో పనిచేయాలి

September 18, 2019

రాష్ట్ర ప్రభుత్వం,ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేయుటకు నిబద్ధతతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్‌ ‌జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌ ‌నుండి వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించి జిల్లాల వారిగా కలెక్టర్‌ ‌లు, జిల్లా పరిషత్‌ ‌సిఇఓ లతో కార్యక్రమం అమలుపై సమీక్షిస్తూ పకడ్బందీగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చీఫ్‌ ‌సెక్రెటరీ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రణాళిక ప్రకారం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పరిష్కరించబడిన గ్రామ సమస్యల గురించి సమీక్షించారు. ఈ కార్య క్రమంలో భాగంగా గ్రామాల్లో జరిగిన మార్పును పరిశీలిం చుటకు రాష్ట్రం
నుండి సీనియర్‌ అధికారులతో కూడిన 100 బృందాలను పంపనున్నట్లు అన్నారు.గ్రామ సమగ్ర పరిశుభ్రత ధ్యేయంగా గ్రామంలోని అందరిని భాగస్వాములుగా చేస్తూ పనులు చేపట్టాలని కోరారు. తూతూ మంత్రంగా కాకుండా సర్పంచ్‌, ‌గ్రామ కార్యదర్శి అంకితభావంతో అందరూ పాల్గొనే విధంగా కృషి చేయాలని సూచించారు.శానిటేషన్‌ ‌లో భాగంగా గ్రామంలోని అన్ని ప్రదేశాలు, ప్రభుత్వ సంస్థలు పరిశుభ్రం, పచ్చదనం నిర్వహించాలని చెప్పారునెల రోజుల్లో జరిగిన పరిశుభ్రత అదే విధంగా నిరంతరం కొనసాగేలా ప్రజల్లో అవగాహన కలిగించాలని అన్నారు. ప్రజల ప్రవర్తన లో మార్పు రావాలని,నా గ్రామాన్ని నేను పరిశుభ్రంగా ఉంచుకొంటాననే పరివర్తన ప్రజల్లో కనిపించాలని తెలిపారు.ప్రతి గ్రామపంచాయతీలో స్మశాన వాటిక, డంపింగ్‌ ‌యార్డ్, ‌నర్సరీలు వెంటనే ఏర్పాటుతో పాటు %వస్త్ర•% నిధులతో అభివృద్ధి చేయాలని సూచించారు.గ్రామాల్లో గ్రీన్‌ ‌ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు.జిల్లా కలెక్టర్‌ ‌డా. గౌరవ్‌ ఉప్పల్‌ ‌మాట్లాడుతూ జిల్లాలో ప్రణాళికబద్ధంగా గ్రామ స్థాయి నుండి ప్రణాళిక అమలు జరిగేలా చర్యలు తీసుకొని గ్రామాల పరిశుభ్రత, శానిటేషన్‌, ‌డంపింగ్‌ ‌యార్డ్, ,‌క్రిమిటోరియా విద్యుత్‌ ‌సమస్యలు పరిష్కారాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి రోజు తాను క్షేత్ర స్థాయిలో గ్రామాలను ఆకస్మికంగా వెళ్లి చేపట్టిన నిర్వహణ పనులను పరిశీలించడం జరిగిందన్నారు. గ్రామాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తుల భాగస్వామ్యంతో చురుకుగా పాల్గొంటున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమం ఉద్దేశం క్రింది స్థాయి వరకు గ్రామంలో చేరే విధంగా గ్రామస్తులను చైతన్య పరిచినట్లు,పనులు గుర్తించి పనులు నిర్వహించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గ్రామంలో ప్రవేశించగానే మార్పు కనబడేలా గ్రామం పొడవున పిచ్చి మొక్కల తొలగింపు చేయించినట్లు తెలిపారు. గ్రామాల్లో డంపింగ్‌ ‌యార్డ్, ‌క్రిమిటోరియా, నర్సరీల కొరకు ప్రభుత్వ స్థలాన్ని, దాతల నుండి స్థల సేకరణ చేసినట్లు తెలిపారు. వీటిని ఈ.జి ఎస్‌ ‌లో అభివృద్ధి కొరకు మంజూరు కు అంచనాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో కార్యక్రమం గ్రామాల్లో అమలు జరుగుతున్న తీరును జిల్లా పరిషత్‌ ‌సి ఈ. ఓ.వీర బ్రహ్మ చారి వివరించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో హైదరాబాద్‌ ‌నుండి పంచాయతీ రాజ్‌ ‌గ్రామీణ అభివృద్ధి సంస్థ కమిషనర్‌ ‌రఘు నందన్‌ ‌రావు, ముఖ్యమంత్రి ఓ ఎస్‌ ‌డి స్మిత సబర్వాల్‌, ‌ప్రియాంక వర్గీస్‌,, ‌నల్గొండ నుండి డి.ఎఫ్‌. ఓ.‌శాంతా రాం, జిల్లా పంచాయతీ అధికారి విష్ణు వర్ధన్‌ ‌రెడ్డి,ట్రాన్స్ ‌కో ఎస్‌.ఈ.‌కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.