అంగరంగ వైభవో పేతంగా
కందుకూరు మండల మాజీ జెడ్పిటిసి ఏనుగుల జంగారెడ్డి కుమారుని వివాహం
పలు పార్టీల ప్రముఖులు హాజరు
కందుకూరు ప్రజాతంత్ర డిసెంబర్ 8 : రాష్ట్ర పిసిసి సభ్యులు,రంగారెడ్డి జిల్లా జెడ్పిటిసి మాజీ ఫ్లోర్ లీడర్,కందుకూరు మండల మాజీ జెడ్పిటిసి ఏనుగు జంగారెడ్డి, దేబ్బడగూడ ప్రస్తుత సర్పంచ్ ఏనుగు శ్రావణీల కుమారుని వివాహం అంగరంగ వైభోగమేతంగా జరిగింది.ఈ వివాహ వేడుకలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోని నోవాటేల్ ప్రాంగణంలో గల జిఎంఆర్ ఎవెన్యూలో వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి.నూతన వధూవరులను ఆశీర్వదించడానికి ఆయా పార్టీల ప్రముఖులు,సీనియర్ రాజకీయ నాయకులు కార్యకర్తలు దెబ్బడగూడ క పరిసర గ్రామాల ప్రజలతో పాటు మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి సర్పంచ్ శ్రావణి-జంగారెడ్డి లను కలసి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి చిన్నారెడ్డి,మర్రి నిరంజన్ రెడ్డి,కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి,జిల్లా పార్టి అధ్యక్షులు చల్లా నరసింహా రెడ్డి,దేపా భాస్కర్ రెడ్డి,పలువురు ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.