పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని దాదాపూర్ గ్రామానికి చెందిన చిన్న కావలి శ్రీశైలం అనారోగ్యంతో మృతి చెందడంతో విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి,పరిగి ఇంఛార్జి కాసాని వీరేష్ బాబు అంత్య క్రియల నిమిత్తం 5వేల రూపాయలు మృతుడి కుటుంబ సభ్యులకు కాసాని యువసేన సభ్యుల ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణ,ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రమేష్,ఉప సర్పంచ్ గఫ్ఫార్, ఆర్టీఐ ప్రెసిడెంట్ చెన్నయ్య, గ్రామస్తులు వడ్ల రమేష్,శివ,కృష్ణ,వి.అనంతేష్,చి న్న కావలి మల్లేష్, శ్రీను రమేష్ తదితరులు పాల్గొన్నారు.