వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

అడవుల నరికవేతను సహించం : సుప్రీమ్‌ ‌కోర్టు

September 14, 2019

అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట అడవులను నరికేస్తామంటే సమ్మతించబోమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అడవులను ధ్వంసం చేయవద్దని గోవా ప్రభుత్వాన్ని కోరింది. కోర్టులు ఇస్తున్న ఉత్తర్వులను అడ్డంపెట్టుకుని రాజకీయ నాయకులు నీతినియమాలను వదిలేసి తమ నిర్ణయాలను అమలు చేస్తున్నారు. మేం వెన్నంటి ఉన్నాం. జాతీయ సగటు కంటే ఎక్కువగా అటవీ విస్తీర్ణం ఉంది కదా అని.. ఆ భాగాన్ని ధ్వంసం చేయకండని ఆ హితవు హితవు పలికింది. గోవాలో 62 శాతంఅటవీ ప్రాంతమేనని, కొన్ని ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది ఆటంకంగా మారిందంటూ, గతంలో సుప్రీం ఇచ్చిన ఓ తీర్పును సవరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ ‌విచారణలో బెంచ్‌ ఈ ‌వ్యాఖ్యలు చేసింది.