అదాని చేతిలో బిజెపి స్టీరింగ్‌

తలసరి ఆదాయంలో నెంబర్‌ 1 ‌స్థానంలో తెలంగాణ
సిఎం కెసిఆర్‌ ‌పాలనకు మళ్లీ పట్టం కడితే మరింత సంక్షేమం, అభివృద్ధి
మలక్‌పేటకు టివి టవర్‌ ‌పేరు బదులుగా ఐటి టవర్‌గా మారుస్తా
మలక్‌ ‌పేటలో ఐటి టవర్‌కు మంత్రి కెటిఆర్‌ ‌భూమి పూజ
దళిత బంధుతో దళితుల జీవితాల్లో ఆర్థిక మార్పులు : మురుగును తరలించే వాహనాలను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2 : ‌బీఆర్‌ఎస్‌ ‌స్టీరింగ్‌ ‌కేసీఆర్‌ ‌చేతిలో ఉందని, ఎంఐఎం స్టీరింగ్‌ అసదుద్దీన్‌ ‌చేతిలో ఉందని, బీజేపీ స్టీరింగ్‌ ‌మాత్రం అదానీ చేతిలో ఉందని మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నేతృత్వంలో తలసరి ఆదాయం సహా పలు అంశాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్‌ ‌వన్‌గా నిలిచిందన్నారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌, ‌హర్యానాను అధిగమించామని చెప్పారు. దేశానికి తెలంగాణ ధాన్యాగారంగా మారిందన్నారు. హైదరాబాద్‌ ‌మలక్‌పేటలో ఐటెక్‌ ‌న్యూక్లియస్‌ ఐటీ టవర్‌ ‌నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ ‌సోమవారం భూమి పూజ చేశారు. అనంతరం కెటిఆర్‌ ‌మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో స్వల్ప కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశామన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. హైదరాబాద్‌ అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాలకు మెట్రో విస్తరిస్తామని చెప్పారు. ఓల్డ్ ‌సిటీకి మెట్రో తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మూసీ ఆధునీకరణ పనులను త్వతరలో పూర్తిచేస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లో గతంలో తరచూ కర్ఫ్యూ పరిస్థితులు ఉండేవని, కానీ సీఎం కేసీఆర్‌ ‌పాలనలో తొమ్మిదేండ్లుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉందన్నారు. చిన్నప్పుడు మలక్‌పేట్‌ అం‌టే టీవీ టవర్‌ అనేవాళ్లని, రాబోయే రోజుల్లో మలక్‌పేట అంటే ఐటీ టవర్‌ అం‌టారన్నారు. 44.20 ఎకరాల్లో ఐటీ టవర్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. అయితే మొదటి విడతగా 10.35 ఎకరాల్లో రూ.1,032 కోట్ల వ్యయంతో 21 అంతస్తులతో 20 లక్షల చదరపు అడుగుల్లో ఐటెక్‌ ‌న్యూక్లియస్‌ ఐటీ టవర్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. 36 నెలల్లోనే ఐటీ టవర్‌ ‌నిర్మాణాన్ని పూర్తిచేస్తామని వెల్లడించారు. మైక్రోసాఫ్ట్, అడోబ్‌ ‌వంటి పెద్దకంపెనీలు ఇక్కడకు తీసుకొస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం దూసుకెళ్తున్నదని చెప్పారు. బెంగళూరు కంటే అధికంగా ఐటీ ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి అసదుద్దీన్‌ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు.

దళిత బంధుతో దళితుల జీవితాల్లో ఆర్థిక మార్పులు : మురుగును తరలించే వాహనాలను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌
‌ప్రతి దళిత కుటుంబానికి లాభం చేకూర్చే విధంగా దళితబంధు అందజేస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దళితుల ఉద్ధరణ కోసమే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. దమ్మున్న నాయకులతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. సోమవారం హైదరాబాద్‌ ‌హుస్సేన్‌సాగర్‌ ‌తీరంలోని అంబేద్కర్‌ ‌విగ్రహం వద్ద మురుగు తరలించే వాహనాలను మంత్రి కేటీఆర్‌ ‌ప్రారంభించారు. లబ్ధిదారులకు వాహనాలకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను అందించారు. అనంతరం మాట్లాడుతూ.. దళితబంధు అందాల్సిన వారు ఇంకా లక్షల్లో ఉన్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. భవిష్యత్‌లో అర్హులైన అందరికీ దళిత బంధు సాయం అందిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ‌ప్రభుత్వం కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నదని తెలిపారు. గాంధీజీ ఆలోచనలతో స్వచ్ఛ హైదరాబాద్‌, ‌పట్టణ, పల్లె ప్రగతి కార్య క్రమాలను చేపడుతున్నామన్నారు.

దేశంలో ఎవరూ చెప్పని విధంగా సఫాయి అన్న నీకు సలా అని సీఎం కేసీఆర్‌ ‌చెప్పారని గుర్తు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా 162 సిల్ట్ ‌కార్టింగ్‌ ‌వాహనాలను అందించడం సంతోషంగా ఉందన్నారు. వీటికో రూ. కోటికిపైగా నిధులు ఖర్చు చేశామని తెలిపారు. ప్రతి వాహనానికి జలమండలి పని కల్పిస్తుందని చెప్పారు. మూడు నెలలకు ఒకసారి వాహనాన్ని జలమండలి తనిఖీ చేస్తుందన్నారు. గాంధీని ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పరిపాలిస్తున్నారని చెప్పారు. శాంతియుత పోరాటం చేసి కేసీఆర్‌ ‌రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. గాంధీ ఫొటోలు పెట్టుకుని దిల్లీలో కొందరు నినాదాలు ఇస్తున్నారని విమర్శించారు. దిల్లీలో గాంధీజీ ఫొటోలకు పోజులు ఇవ్వడం తప్ప..ఆచరించరని విమర్శించారు. గాంధీ ఆలోచనలతో స్వచ్ఛ హైదరాబాద్‌, ‌పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అంతకుముందు వేదికపై గాంధీ మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, ‌భేతి సుభాష్‌ ‌రెడ్డి, ముఠా గోపాల్‌, ‌ప్రకాశ్‌ ‌గౌడ్‌, ‌గోపీనాథ్‌, ‌మెతుకు ఆనంద్‌, ఎమ్మెల్సీ ప్రభాకర్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page