అధికారంలోకి వచ్చిన ఆడబిడ్డల పెళ్లిలకు లక్ష

కందుకూరు ప్రజాతంత్ర నవంబర్ 17 :తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డల పెళ్లిళ్లకు లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం సైతం ఇస్తామని మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని కందుకూరు మండలంలోని సరస్వతి గూడ,లేమూరు, అగర్మియగూడ,రాచులూరు,బేగంపేట్, మాదాపూర్ తదితర గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా దొరల పాలన నడుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో సబితా రెడ్డి కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి కారు ఎక్కిందని విషయాన్ని ప్రజలు మరువద్దని ఆయన తెలిపారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్పై ఆమె లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు మాత్రమే కనబడుతున్నాయని బిఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని ఆయన ఆరోపించారు.అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీ పథకాలను తప్పక నెరవేరుస్తుందని ఆయన తెలియజేశారు.ప్రతి ఇంటి మహిళలకు 2500,500లకే గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల లోపు విద్యుత్ ఉచితంగా అందజేస్తామని మహిళలు ప్రయాణించేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం నెలకొల్పుతామని,వృద్ధులకు డివ్యాంగులకు,ఒంటరి మహిళలకు 4వేల  రూపాయల పింఛను అందిస్తామని ఆయన పేర్కొన్నారు.నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని ప్రజల దీవెనతో తాను విజయదుందబి మోగిస్తానని డంకాపతంగా తెలియజేశారు.ఇచ్చిన హామీలను నెరవేర్చని బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందలేక పోతుందని ఆయన అన్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి,కందుకూరు మండల మాజీ జెడ్పిటిసి ఏనుగుల జంగారెడ్డి,యువజన కాంగ్రెస్ అధ్యక్షులు దంతొజి నరసింహ చారి, కందుకూరు మండల వైస్ ఎంపీపీ గంగుల శమంతా ప్రభాకర్ రెడ్డి ఆయా గ్రామాల నాయకులు,కార్యకర్తలు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page