అధికారం కట్టబెట్టే శక్తిమంతుల వోట్ల కోసం తహతహ..

నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు దేశం పార్టీ 1983 ఎన్నికల నుంచి 2014 వరకూ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక వెలుగు వెలిగి తెలంగాణలో దశాబ్దంగా చీకటి మాటున పడిరది . 2014 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్‌ లో రాజ్యమేలి 2019 లో వైఎస్‌ ఆర్‌ పి చేతిలో ఓటమి చవి చూసి విపక్షంలో అధికార పక్షం ధాటికి తట్టుకోలేక నీరసపడిరది. పార్టీ ఆవిర్భావం నుంచీ తెలంగాణలో సైతం లీడర్లను, కేడార్లను పెంచుకుని అసంబ్లీ ఎన్నికల్లో అధిక సంఖ్యలో సీటు గెల్చుకుని వోట్ల శాతాన్ని నిలబెట్టుకుని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత 2014 నుంచీ కనుమరుగైంది. ఆంధ్ర ప్రదేశ్‌ లోనే ఉత్సాహం మాయమైన సందర్భంలో, స్థానికంగా వోటర్లు, అభిమానులు, నాయకులు ఉన్నా తెలంగాణ సెంటిమెంట్‌ ముందు తట్టుకోలేక టిడిపి లో శూన్యత ఆవహించింది. ఈ నెల 30వతేదీన తెలాంగాణ అంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం అభిమానుల పాత్ర ఏమిటన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న..!

తెలుగు దేశం నాయకులే కకావికలై అధికార భారతీయ రాష్ట్ర సమితిలో చేరడంతో కార్యకర్తలు, వోటర్ల అడ్రసులే గల్లంతయ్యాయి. రాష్ట్ర విభజన జరిగినా ఆంధ్ర ప్రాంతం నుంచీ వలస వచ్చి తెలంగాణలో స్థిరపడిన వారిలో ఆంధ్రలో జరుగుతున్న పరిణామాలు జీర్ణించుకోలేకున్నా తమకు సంబంధం లేని విషయంగా పట్టించుకోలేదు.  అయితే ఉద్యొగం వ్యాపారం, వ్యవసాయం, విద్య, వైద్య పరంగా ఇక్కడ ఉన్నా స్థిరాస్తులు, బంధువర్గంతో స్వగ్రామాలతో సంబంధం ఉన్నవారే అధికం. ఆ విషయం సంక్రాంతి, దసరా వంటి పండుగలు, పబ్బాలలో, వేసవి సెలవుల్లో తెలంగాణ నుంచి ఆంధ్రకు   తరలివెళుతున్న ప్రయాణికుల సంఖ్యే నిదర్శనం.   ఆంధ్రలో ఎన్నికల సమ్యంలో ఇక్కడినుంచి వెళుతున్న వారి సంఖ్య కూడా తక్కువ కాదు. 1983 నుంచి ఎన్నికల్లో తెలుగుదేశం బలం  తెలంగాణలో అంచలంచెలుగా పెరిగిన విషయం ఎవరూ కాదనలేరు. అసెంబ్లీలో సీట్ల సంఖ్య, సాధించిన వోట్ల శాతం అందుకు తార్కాణం. అంతేగాక కులాభిమానాలు కూడా తోడయ్యాయి. 1983 లో తొలిసారి టిడిపి ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగినప్పుడు  294 స్థానాలకుగాను 188 లో విజయ భేరి మోగించి తొలి ప్రయత్నంలోనే అధికార పీఠం అధిరోహించింది. సినీ నటుడుగానే పరిచయం ఉన్న ఎన్‌ టి ఆర్‌  ప్రభావం తెలంగాణపై పని చేసి 38 స్థానాల్లో ఎమ్మెల్యేలు గెలుపొందారు.నాడు కొంత అప్పటి సెటిలర్ల ప్రభావం ఉండొచ్చు. ఆ ఎన్నికల్లో తెలుగు దేశం 46.3 శాతం వోట్లు సాధించింది. ఇక నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు కారణం గా 1985 లో జరిగిన ఎన్నికల్లో మిత్ర పక్షాల మద్దతుతో అసాధారణ రీతిలో విజయం సాధించిన టిడిఫి తెలంగాణలో 58 స్థానాలకు బలం పెంచుకుంది. అప్పటి ఎన్నికల్లో టిడిపి 46 శాతం వోట్లు పొందింది.

మూడో సారి 1989 ఎన్నికల్లో పార్టీ లుకలుకలతో పాటు చెన్నారెడ్డి కేంద్ర బిందువుగా నిలిచి కాంగ్రెస్‌ ను గెలిపించగలగడంలో విజయం సాధించడం వలన టిడిపి సభ్యుల సంఖ్య అసెంబ్లీలో 74 కు పడిపోగా తెలంగాణ నుంచి కేవలం 18 మంది మాటం అసెంబ్లీ మెట్లెక్క గలిగారు. 1989 ఎన్నికల్లో టిడిపి వోట్ల గ్రాఫ్‌ 36.54% కు దిగజారింది. ఆ అయిదేళ్ళలో కాంగ్రెస్‌ లో విభేదాలు తారస్థాయికి చేరి కుమ్ములాటలు మొదలై మంత్రుల మార్పు తో అసంతృప్తి చెందిన వోటర్లు 1994 ఎన్నికల్లో టిడిపీ  మరోసారి ఢంకా బజాయించి వోట్ల శాతాన్ని 44.14 కి పెంచుకుని 216 సీట్లు గెల్చుకోగా అందులో 68 స్థానాలు తెలంగాణ నుంచే లభించాయి . ఆ అయిదేళ్ళలో కాంగ్రెస్‌ లో విభేదాలు తారస్థాయికి చేరి కుమ్ములాటలు మొదలై ముఖ్య మంత్రుల మార్పు తో అసంతృప్తి చెందిన వోటర్లు 1994 ఎన్నికల్లో టిడిపి  మరోసారి ఢంకా బజాయించి వోట్ల శాతాన్ని 44.14 కి పెంచుకుని 216 సీట్లు గెల్చుకోగా 68 స్థానాలు తెలంగాణ నుంచే లభించాయి.

1999 లో డా .వై ఎస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించడంతో రాష్ట్ర ఫలితాలు   తల్లకిందులై  టిడిఫి ఓటమి రుచి చూస్తుందన్న భావనలో మునిగి పదవులకోసం పోలింగ్‌ ముందే పోటీ ఎదురవ్వడంతో టిడిపి సందిగ్ధంలో పడిరది. అనూహ్యంగా అంచనాలు తలకిందులై టిడిపి విజయ కేతనం ఎగరేసి 180 స్థానాలు గెల్చుకోగా అందులో తెలంగాణ వాటా 50 మంది ఎమ్మెల్యేలు. తరువాత 2001 లో తెలంగాణ సాధన ఉద్యమానికి కె సి ఆర్‌ శ్రీకారం చుట్టడంతో పాటు వై ఎ ఆర్‌ కాంగ్రెస్‌ పగ్గాలుపట్టుకుని ఉభయ కమ్యూనిస్టు లు, టిఆర్‌ఎస్‌ తో కలసి మిత్రత్వం నెరపి 2004 ఎన్నికల్లో  కాంగ్రెస్‌ 187 స్థానాలు గెల్చుకోగా, తెలుగు దేశం 47, టి ఆర్‌ ఎస్‌ 26, ఉభయ కమ్యూనిస్ట్‌ పార్టీలు 15 సాధించడంతో తెలుగు దేశం డీలా  పడిరది. అప్పటినుంచే క్షీణత ప్రారంభమైంది.  టిడిపి గెల్చుకున్న 47 సీట్లలో తెలంగాణ నుంచి 11 రావడం విశేషమే.. మళ్ళీ 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా 156కు దిగగా, తెలుగుదేశం పుంజుకుని 92 స్థానాలు గెల్చుకుంది. అందులో 39 తెలంగాణ నుంచే కావడ తెలంగాణలో టిడిఫి స్థిరత్వం సాధించుకున్నట్లు నిరూపణ అయింది. తదనంతరం కేంద్రలోని యుపిఎ ప్రత్యేక తెలంగాణ ప్రకటించడంతో. తెలుగుదేశం కథనం ముగిసినట్లయింది. 2014 ఎన్నికల్లో ఎపితో పాటు టిడిపి తెలంగాణలో 15 స్థానాలనుంచీ పోటీ చేయగా ఒక్కటికూడా దక్కక దశ  ముగించింది .  చివరి సారిగా 2018 తెలగాణ అసెంబ్లీ  ఎన్నికల్లో దింపుడు కళ్ళెం ఆశతో తెలుగు దేశం 14మందిని బరిలో నిలపగా సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు ఇద్దరు గెలిచి తరువాత పార్టీ ఫిరాయించడంతో కథ సమాప్తమైంది.

పార్టీ పరంగా తెలుగుదేశం చిరునామా గల్లంతయినా అభిమానులు, వోటర్లు మిగిలారు.. ప్రస్తుత రాజకీయాల పట్ల అసంతృప్తి ఉన్నా మరో మార్గం లేక తెలంగాణ సెంటిమెంట్‌ వారిని అచేతనులను చేసింది.  ఈ తరుణంలో ఆంధ్రలో అనేక ఆరోఫణ్లతో అక్కడి ప్రభుత్వం పలు కేసులను టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై నమోదు  చేసి అరెస్ట్‌ చేసి 50 రోజులపాటు రాజమండ్రి కేంద్రకార్యాలయంలో బందీ చేయడంటొ ఆంధ్రతో పాటు తెలంగాణ లో నివురుగప్పిన నిప్పులా ఉన్నా అసంఖ్యాక యువత, మహిళలు పలురకాలుగా అనేక రోజులు నిరసన, ఆగ్రహ ప్రదర్సనలు చేసారు. వీరిలో అధిక శాతం ఐటి రంగ, ఫార్మా రంగం, విద్యా రంగాలకు చేందిన విద్యాధికులుకావడం  విశేషం. ఇంత జరుగుతున్నా భారాస ప్రభుత్వం బాబుకు అనుకూలంగా స్పందించకపోవడం, నిరసనను అణచివేసే పోలీసు చర్యకు ఉపక్రమించడం  యువతలో ఆగ్రహం కలిగించింది. అంతే కాక పలు జిల్లాలలోని ఆంధ్ర ప్రాంతీయులు, రైతులు భారాసపై అగ్రహంతో ఉన్నారు. వర్గాలు, కులాలు, వృత్తి, నైప్ణ్యాల పరంగా కూడా చంద్రబాబు, తెలుగుదేశం  అభిమానులు సమయంకోసం ఎదురు చూస్తున్నారు. భారాసా అధినేత కాని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు చంద్రబాబు అరెస్ట్‌ ను ఖండిరచక పోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉనారు. రాజకీయంగా కాక కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని పలువురు మాజీ టిడిపి నేతలూ, ఎన్నికలలో కాంగ్రెస్‌ మిత్రపక్షాలుగా పోటీలో ఉన్న సిపిఐ, టిజెఎస్‌, టిఎస్‌ఆర్సి పి, బిఎస్పి, ఇండిపెండెంట్లు.. భారాస అసంతృప్తి వాదులు ఈ ఎన్నికల్లో టిడిపి, చంద్రబాబు మద్దతు దారుల వోట్లను పొంది విజయం సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసారు.
ఆ వోట్లను తాము రాబట్టుకుంటే రాష్ట్రంలో భారాసపై విజయం సాధించవచ్చునన్న అలోచన. ఈ మార్గాన్నే భాజపాకూడా అనుసరించాలనుకున్నా, బిజెపి జాతీయ నాయకులు చంద్రబాబు విషయానికి ప్రాధాన్యత ఇవ్వక పోవడం, మోదీనే నమ్ముకోవడం  ప్రజలలో సానుభూతి కనబడక మౌనంగా ఉన్నారు. రేవంత్‌ రెడ్డి  ఈ విషయంలో అందరికంటే ముందుండి, మాజీ టిడిపి నేతగా, చంద్రబాబు సైన్యంలో అన్ని ఆనుపానులూ తెలిసిన మాజీ అధికారిగా, కెసిఆర్‌ కు ప్రధాన ప్రత్యర్థిగా సిఎం పదవికి పోటీదారుగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

ఎన్టీఆర్‌ అభ్యుదయభావాలు,  సంస్కరణలు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ అభ్యుదయభావాలు, సమసమాజ సిద్ధాంతాలతో, సంస్కరణలతో తెలంగాణ ప్రాంతంపై తనదైన ముద్ర వేశారు. ఆయన అధికారంలోకి వచ్చే నాటికి ఆంధ్ర ప్రాంతంలో మునసబు, కరణాలు… తెలంగాణలో పటేల్‌, పట్వారీలు ప్రజలను శాసించే  ఆ వ్యవస్థలను రద్దుచేయడంతో బడుగులకు స్వేచ్ఛ దొరికింది. వారందరినీ ఎన్టీఆర్‌ రాజకీయాలలోకి ఆహ్వానించి ప్రోత్సహించారు. ఫలితంగా తెలంగాణలో బీసీ, దళిత నేతలు రాజకీయాల్లో రాణించారు. ఆదిలాబాద్‌ జిల్లా అక్కడి గిరిజనుల బతుకులను చూసి చలించి గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు గిరిజనులకే చెందాలని, గిరిజనులకు అటవీ హక్కులు ఉండాలని… ఇలా 14 నిర్ణయాలు తీసుకుని జీఓ లు జారీ చేసారు. అలాగే వలసలు ఎక్కువగా ఉన్న.. ఆదిలాబాద్‌, మహబూబ్‌ నగర్‌.. వంటి జిల్లాల్లో వివిధ పథకాలను అమలు చేసి.. అక్కడ నుంచి ప్రజలు వలసబాట పట్టకుండా చర్యలు తీసుకున్నారు. పాలమూరు ప్రాంతంగా పిలువబడే నాటి మహబూబ్‌ నగర్‌ జిల్లా నుండి కరువు తరిమేసేందుకు ప్రియదర్శిని జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఎన్టీఆర్‌ చేపట్టారు.
హైదరాబాద్‌ లోని ట్యాంక్‌బండ్‌ మీద కొలువుదీరిన తెలుగు సాహిత్య, సాంస్కృతిక, వైతాళికుల విగ్రహాలు చూడగానే ప్రజలకు గుర్తొచ్చేది ఎన్టీఆరే. ‘తెలుగు వెలుగుల మూర్తి నిక్షిప్త కళా ప్రాంగణం’ పేరిట విగ్రహాల ఏర్పాటు, ట్యాంక్‌బండ్‌ సుందరీకరణ… బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పేరిట హుస్సేన్‌సాగర్‌ మధ్య బుద్ధుని విగ్రహం ఏర్పాటు… ఇవన్నీ ఎన్టీఆర్‌.కృషికి నిదర్శనాలు. హుస్సేన్‌సాగర్‌ పక్క నుంచి ఖైరతాబాద్‌ వరకు ఉన్న కచ్చా రోడ్డును విస్తరించింది… పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్‌ వరకు, కూకట్‌పల్లి నుంచి చార్మినార్‌ వరకు రోడ్డు విస్తరణ చేపట్టింది ఎన్టీఆర్‌ హయాంలోనే. హైదరాబాద్‌ లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నెలకొల్పింది… అదే ప్రాంగణంలో లలిత కళాతోరణం ఆడిటోరియంను నిర్మించింది ఎన్టీఆరే. అంతకు ముందు గౌలిగూడలో ఒక రేకుల షెడ్డు వంటి బస్టాండ్‌ ను. హైదరాబాద్‌ నగరానికి రాజధానికి తగ్గ స్థాయిలో అత్యంత విశాలమైన ఇమ్లిబన్‌ (మహాత్మాగాంధి) బస్‌ స్టేషన్‌ను నిర్మించింది ఎన్టీఆరే. తెలంగాణ ప్రజల కోరికను మన్నిస్తూ… 1985 డిసెంబర్‌లో స్థానికేతరులను వారివారి ప్రాంతాలకు పంపడానికి 610 జీఓను తీసుకొచ్చారు.

చంద్రబాబు హయాంలో బహుముఖ విస్తరణకు బీజం..
యువతకు వేలల్లో ఐటి ఉద్యోగాలిస్తోన్న హైటెక్‌ సిటీ… అభివృద్ధికి అద్దంలా నిలిచే సైబర్‌ సిటీ.. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌ రోడ్‌, ఎంఎంటిఎస్‌ పరుగులు, ఫ్లై ఓవర్లు, మల్టీప్లెక్సులు, బిజినెస్‌ స్కూళ్ళు, అంతర్జాతీయ వ్యాపార సంస్థలు…. హైదరాబాద్‌ లో ఇంతటి అభివృద్ధికి బాటలు వేసింది నూటికి నూరుపాళ్లూ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వమే. ఈరోజు మామూలు డిగ్రీ చదివిన వ్యక్తి, హైదరాబాద్‌ వస్తే ఉపాధి దొరుకుతుంది అనే భరోసా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే. తన విజన్‌ 2020 ఆలోచనలకు చంద్రబాబు ఇచ్చిన తొలిరూపమే సైబరాబాద్‌. అప్పటివరకు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ అనే జంట నగరాల సరసన అత్యాధునిక అభివృద్ధికి ప్రతీకగా నిలిచింది సైబరాబాద్‌. ఐటీ రంగంతో పాటు నానక్‌ రామ్‌ గూడలో లక్షల మందికి ఉపాధిని ఇస్తోన్న ఆర్థిక నగరం ఏర్పాటుకు  కృషి చేసింది. అలాగే ప్రభుత్వమే పట్టుబట్టి ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అధారిటీ (ఐఆర్డీఏ) కేంద్ర సంస్థను హైదరాబాద్‌ కి తీసుకుని రావడంతో… బీమా సంస్థలు నగరానికి వరుసగట్టాయి. హైదరాబాద్‌ బయోటెక్‌ హబ్‌  చేయటంలో  చేసిన  కృషి అపారం. శామీర్‌ పేట ప్రాంతంలోని బయోటెక్‌ సంస్థలే ఇందుకు నిదర్శనం.

కొవాగ్జిన్‌ వాక్సిన్‌ ను అందించి కొరోనాకు అడ్డుకట్ట వేసి దేశం గర్వించేలా చేసిన భారత్‌ బయో టెక్‌… నెలకొల్పిన జీనోమ్‌ వ్యాలీలోనే ఉంది. ఐసీఐసీఐ నాలెడ్జ్‌ పార్క్‌, రహేజా మైండ్‌ స్పేస్‌, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, నల్సార్‌ యూనివర్సిటీ, గాంధీ హాస్పిటల్‌  ఆధునికీకరణ, చర్లపల్లి జైలు, మలేషియన్‌ టౌన్‌ షిప్‌…సింగపూర్‌ టౌన్‌ షిప్‌, పోచారం ఐటి జోన్‌, కృష్ణా మంచినీటి పథకం, ఈ-సేవా కేంద్రాలు ఏర్పడడం, వైద్యరంగంలో అనేక ప్రత్యేకతలు సంతరించుకుని దేశం గర్వించేలా కార్పోరేట్‌ హాస్పిటల్స్‌  కు నిలయం కావడంతో అవిభక్త రాష్ట్రం వివిధ ప్రాంతాలనుంచి కుల, మతాలకు అతీతంగా, బీద బిక్కి తేడా లేకుండా ప్రజలు ఉపాధికోసం విద్య, వైద్య, ఉద్యోగాలకు రాజధాని, పరిసర ప్రాంతాలకు వచ్చి కుటుంబాలతో స్థిరపడ్డారు.. చంద్రబాబు అరెస్ట్‌ ను కాంగ్రెస్‌, మిత్ర పక్షాల అభ్యర్థులు ప్రస్తావిస్తూ 15 శాతం పైగా ఉన్న సెటిలర్ల వోట్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం కూడా మద్దతు పలుకుతున్నది. మరి సెటిలర్లు   అసంఖ్యాకంగా ఉన్న ఐటి రంగ ఉద్యోగులు, విద్యా వంతుల నిర్ణయం ఎలా ఉంటుందో..  తెలుగు దేశం ఆవిర్భావం నుంచీ తెలంగాణ అభివృద్ధికి ఎన్‌ టీ ఆర్‌  , చంద్రబాబు తీసుకున్న   నిర్ణయాలు, చూపిన చొరవ, చేసిన అభివృద్ధి ని మరచిపోరన్న నమ్మకం కూడా కాంగ్రెస్‌లో ఉంది.

 -నందిరాజు రాధాకృష్ణ,
వెటరన్‌ జర్నలిస్ట్‌,
98481 28215

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page