పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 7: గత పాలకుల హయాంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అవినీతికి చిరునామాగా నిలిస్తే నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి పథకం పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలో 5 కోట్ల 7 లక్షల రూపాయల అంచనా చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినితో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన.. ప్రారంభోత్సవాలు చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామ అవసరాలకు అనుగుణంగా ప్రజల సమక్షంలో ప్రణాళికలు రూపొందిస్తూపూర్తిపారదర్శకతతో పనులు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పేదవాడి సంక్షేమం పట్ల మొసలి కన్నీరు కారుస్తూ, తెలంగాణలో అమలు కాని హామీలు కుప్పిస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికలలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా రుద్రారం గ్రామం నుండి గీతం యూనివర్సిటీ వరకు రెండు కోట్ల 25 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు, మహిళా సమాఖ్య భవనం, మార్కెట్ యార్డ్, సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకస్థాపన చేసి పోచారం గ్రామ పరిధిలోని గణపతి గూడెంలో మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, సర్పంచులు సుధీర్ రెడ్డి, జగన్, ఎంపీటీసీ రాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.