తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.
ప్రజలకు జవాబుదారీతనం గా ఉండటం మన అందరి బాధ్యత.
–అవినీతికీ తావులేకుండా పని చేయాలి.
తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయడం లో భాగంగా ఈ నెల 28 నుంచి జనవరి 06 వరకు గ్రామ సభల ద్వారా ప్రజా పాలన కార్యక్రమం జనవరి 28 నుండి ప్రారంభం సందర్భంగా బుధవారం తాండూర్ ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధుల మరియు అధికారుల దిశా నిర్దేశం సమావేశం కొనసాగింది.ఈ సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం ఆరు గ్యారెంటీ పథకాల పై చేయడం సంతోషకరమైన విషయం అని అన్నారు. ప్రభుత్వం అంటేనే ప్రజలకు జవాబుదారీతనం ఉండాలని ఉద్దేశంతో ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.అధికారులు అందరూ కూడా బాగా కష్టపడి ఎన్నికలను విజయవంతం చేసిన విధంగా అదే స్పూర్తితో ఈ ప్రజాపాలన విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని గ్రామ స్థాయి లో సర్పంచ్ లు వార్డు మెంబర్ లు మున్సిపల్ పరిధిలో చైర్మన్ లు కౌన్సిలర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా అధికారులతో సమన్వయం తో పని చేసి మన జిల్లా కు మన తాండూర్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తారు అని అన్నారు.ఈ కార్యక్రమం లో ఆర్డిఓ శ్రీనివాసరావు తాండూరు డిఎస్పి శేఖర్ గౌడ్ మున్సిపల్ చైర్ ర్సన్ స్వప్న పరిమళ తాండూరు ఎంపీపీ అనిత గౌడ్ జడ్పిటిసి దారాసింగ్ శ్రీనివాస్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్లు రవి గౌడ్ లక్ష్మారెడ్డి నియోజకవర్గంలోని ఆయా మండలాల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.