పదవులకు హావి• ఇస్తూ ఒక్కటి చేసే ప్రయత్నంలో మంత్రి కెటిఆర్
స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం, జనగామలో పల్లాకు టికెట్టు ఖరారు?
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : అసంతృప్తి ఉన్న నియోజకవర్గాలపై బీఆర్ఆర్ అధినాయత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అసంతృప్తి ఉన్న లీడర్లను పిలిచి ఒక్కో స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. సీట్లు లభించని వాళ్లకు భవిష్యత్‌లో మంచి స్థానం కల్పిస్తామని హావి• ఇస్తున్నారు. ఈ క్రమంలో కడియం శ్రీహరి, రాజయ్యల మధ్య రాజకీ కుదిర్చారు. ముత్తిరెడ్డి స్థానంలో పల్లా రాజేశ్వర రెడ్డిని జనగామలో దింపేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ క్రమంలో ముత్తిరెడ్డి, రాజయ్యలకు ఆర్టీసీ, రైతుబంధు పరిషత్ ఛైర్మన్ పదవులు ఇచ్చేలా హావి• ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో నచ్చిన వారు ఉంటున్నారు నచ్చని వాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోతున్నారు. మంత్రి కెటిఆర్ ఈ బాధ్యతను భుజాన వేసుకున్నారు. అయితే సిఎం కెసిఆర్ 115 స్థానాల్లో టికెట్లను ఖరారు చేస్తూ ప్రకటంచిన తర్వాత బీఆర్ఎస్లో అసంతృప్తి భగ్గుమన్న విషయం తెలిసిందే.
ఎప్పటి నుంచో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కొందరు బహిరంగంగానే విమర్శలు చేయడం ప్రారంభించారు. మరికొందరు లోలోపలే రగిలిపోతూ పార్టీలోనే ఉంటూ ప్రత్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసే పక్రియలో మునిగిపోయారు. ఇంకొందరు పార్టీకి రాజీనామా చేసే వేరే పార్టీల్లోకి వెళ్లిపోయారు. అయితే స్టేషన్ ఘన్పూర్ అనగానే ఠక్కున గుర్తుకు వొచ్చే రెండు పేర్లు కడియం శ్రీహరి, రాజయ్య. ఎప్పటి నుంచో వీళ్లిద్దరి మధ్య రాజకీయం మండుతూనే ఉంటుంది. ఒకరిపై ఒకరు నేరుగానే విమర్శలు చేసుకుంటారు. ఎన్నికలు సవి•పిస్తున్న టైంలో వీళ్ల రాజకీయం ఏ స్థాయికి వెళ్తుందో అన్న కంగారు బీఆర్ఎస్ పార్టీలో ఉండేది. అంచనాలను తలకిందులు చేస్తూ కడియం శ్రీహరి, రాజయ్య చేతులు కలిపారు. అంతకాదు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి విజయం కోసం పని చేస్తానంటూ రాజయ్య ప్రకటించడం ఇక్క మరో హైలైట్.