అసలు సిసలైన ప్రజాస్వామిక వాది రావి

  • తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యుడు రావి
  • నేడు రావి నారాయణరెడ్డి వర్ధంతి
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక జరిగిన  మొట్టమొదటి లోక్‌సభ (1951-52) ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్‌ అగ్రనేత జవహర్‌లాల్‌ నెహ్రూను మించిన మెజార్టీతో గెలుపొందిన వ్యక్తి ఒక తెలుగు వారు అనే విషయం చాలా మందికి తెలియదు. అంతేకాదు, దేశంలోనే ఆ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు పొందిన లోక్‌సభ అభ్యర్థిగా కూడా రికార్డు సృష్టించింది ఆ తెలుగు వ్యక్తే. ఆయనే తెలంగాణ సాయుధ పోరాట యోధుడుగా ప్రసిద్ధులైన రావి నారాయణ రెడ్డి. హైదరాబాద్‌ రాష్ట్రంలోని నల్గొండ నియోజక వర్గం నుంచి పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (పీడీఎఫ్‌) పార్టీ తరఫున నారాయణ రెడ్డి పోటీ చేసి ఆ ఘనతను సాధించారు. నాడు హైదరాబాద్‌ రాష్ట్రంలో 17 ఏకసభ్య నియోజక వర్గాలు, నాలుగు ద్విసభ్య నియోజక వర్గాలు ఉండేవి. ద్విసభ్య నియోజక వర్గాలకు ఇద్దరు చొప్పున సభ్యులు ప్రాతినిధ్యం వహించే పద్ధతి ఉండేది. నల్గొండ కూడా అప్పుడు ద్విసభ్య నియోజవర్గం గానే ఉండేది. అక్కడ రావినారాయణ రెడ్డితో పాటు పోటీ చేసిన, సుకం అచ్చాలు విజయం సాధించగా, ఇద్దరూ పీడీఎఫ్‌ అభ్యర్థులే కావడం విశేషం.
1952 మార్చి 27 పోలింగ్‌ జరగగా… రావి నారాయణ రెడ్డికి 3,09,162 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి పీ.భాస్కర్‌ రావు పై 2,22,280 ఓట్ల మెజార్టీతో గెలుపొ ందారు. అలాగే ఉత్తర ప్రదేశ్‌ లోని అలహాబాద్‌ కమ్‌జౌన్‌పూర్‌ (పశ్చిమ) ద్విసభ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన జవహర్‌ లాల్‌ నెహ్రూకు 2,33,571 ఓట్లు రావడం జరిగింది. తొలి లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓట్లు పొందిన ఎంపీతో పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించాలని ఆ సందర్భంలో నిర్ణయించారు.  నెహ్రూజీ కన్నా అధిక ఓట్లు సాధించిన రావి నారాయణరెడ్డి చేతులమీదుగా ఢల్లీిలోని పార్లమెంట్‌ భవనం ప్రారంభమైంది. ఇది తెలుగు వారికి గర్వకారణమై మరచి పోలేని సంఘటనగా మిగిలి పోయింది. ఆ ఎన్నికలలో భువన గిరి శాసనసభ స్థానం నుంచి కూడా నారాయణ రెడ్డి పోటీ చేసి విజయం సాధించడం మరో విశేషం. అయితే రావి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా కొనసా గారు. రావి నారాయణరెడ్డి, (జూన్‌ 5, 1908 – సెప్టెంబర్‌ 7, 1991) కమ్యూనిస్టు నాయకులు, తెలంగాణ పోరాటంలో ముఖ్యులు. ఆయన సంఘ సంస్కర్త. ఆంధ్ర మహాసభ ప్రారంభించిన సాంస్కృతికోద్యమాన్ని క్రమంగా వామపక్ష సాయుధ పోరాటంగా పరివర్తన చేసిన గొప్ప నాయకులు. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యునిగా కూడా ఆయనను పేర్కొంటారు. రావి… యాదాద్రి – భువనగిరి జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లిలో 1908, జూన్‌ 5న భూస్వామ్య కుటుంబంలో జన్మించారు.
రెడ్డి హాస్టల్‌ విద్యార్థిగా ఉండగానే అప్పటి నిజాం కళాశాల విద్యార్థి అయిన బద్దం ఎల్లారెడ్డితో కలసి 1930 సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో కాకినాడ వెళ్లి పాల్గొన్నారు. 1931లో హరిజన సేవాస ంఘాన్ని నెలకొల్పి దాని ప్రధాన కార్యదర్శి హోదాలో హైదరాబాద్‌ రాష్ట్ర వ్యాప్తంగా 100 పాఠశాలలు ప్రారం భించారు  రెండు వసతి గృహాలను నిర్వహించారు. 1930లో బ్రిటిష్‌  మహాత్మా గాంధీ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌ లోని హస్మద్‌ గంజ్‌లో బహిరంగ సభలో  బ్రిటిష్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడారు.  1931లో  దేవర కొండలో జరిగిన రెండవ ఆంధ్ర మహా సభలకు తన తోటి విద్యార్థులను పోగుచేసి  హైదరాబాద్‌ నుంచి పాదయాత్రగా వెళ్ళారు. నిజామాంధ్ర మహాసభ లోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్‌, ఆర్యసమాజ్‌, హిందూ మహాసభలతో కలిసి పనిచేసిన కమ్యూనిస్టుగా ఆయన ఆచరణ విశిష్టమైనది. సిద్ధాంత పరంగా విభేదించే శక్తులతో ఐక్య సంఘటన ఏర్పరచి ఏకతాటిపై ఉద్యమాన్ని ఎలా నిర్మిం చవచ్చో తన ఆచరణ ద్వారా నిరూపించిన ప్రజాస్వామిక వాది రావి. 1938లో హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ను స్థాపించిన వారిలో రావి ముఖ్యులు. నిజాం ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీపై విధించిన నిషేధం ఎత్తేయాలని అక్టోబరు 24న తొలిబ్యాచ్‌ సభ్యులుగా సత్యాగ్రహం చేశారు.
ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన ప్రజా పోరా టానికి మార్గ నిర్దేశం చేసిన జననేత ఆయన. తెలంగాణ విమోచన తరువాత ఆయన సిపిఐ లో చాలాకాలం పనిచేశారు. రావి నారాయ ణరెడ్డి విశాలాంధ్ర కోసం చేసిన శ్రమ అనిర్వచనీయం. నిజాం ప్రభుత్వం మీద ఆయన చేసిన సాయుధ పోరాటం చిరస్మరణీయం. 1946-48 కాలంలో హైదరాబాదు సంసా ్థనంలో నిజాం పోలీసుల దాష్టీకాన్ని, మత దురహంకారులైన రజాకార్ల ఆగడాలనూ అరికట్టడ్డ డానికి అజ్ఞాతంగా ఎన్నో గెరిల్లా దళాలను ఏర్పాటు చేసారు.1941లో నల్లగొండ జిల్లా చిలుకూరులో జరిగిన 8వ నిజామాంధ్ర మహాసభకు, 1944లో భువనగిరిలో జరిగిన మహాసభకు ఆయనే అధ్యక్షత వహించారు. వితంతు వివాహాలు, అక్షరాస్యతా కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఆంధ్ర మహాసభను క్రియాశీల రాజకీయ సంస్థగా మలిచారు. భువనగిరి సమావేశాల్లోనే ఆంధ్ర మహాసభ అతివాద, మితవాద శిబిరాలుగా చీలి పోయింది.
మహాత్మాగాంధీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తన భార్య సీతాదేవితో వెళ్ళి కలిసి తన భార్య ఒంటిపై ఉన్న నగలన్నింటినీ తీసి గాంధీ చేతిలో పెట్టి, హరిజన సేవక సంఘానికి ఇవ్వమని గాంధీజీని అభ్యర్థించిన దేశభక్తులు రావి. దేశ స్వాత ంత్య్రానికి ముందు సాగిన సాయుధ పోరాటాన్ని వ్యూహా త్మకంగా సమర్థించిన రావి, తరువాతి కాలంలో పోరాటాన్ని కొనసాగి ంచాలనే ‘మెజారిటీ’ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తాను ఎన్నటికీ వీరతెలంగాణ వాదిగానే ఉంటానని చాటి చెప్పారు. గాంధేయవాది అయిన రావి తనకు సంక్రమించిన భూమిలో 20 ఎకరాలను మాత్రమే ఉంచుకుని 500 ఎకరాలను రైతు కూలీలకు పంచిపెట్టారు. తాను మరణిస్తే తన భార్య వైధవ్య ప్రతీకలను ఆమోదించ రాదని, కట్టూబొట్టులతో సలక్షణంగా ఉండాలని, ఆమె తన అభీష్టానుసారం జీవించవచ్చనీ, అలాగే  తన అస్థికలను గంగా నదిలో కలప వద్దని, పొలంలో చల్లితే చాలనీ వీలు నామా రాసిన సామాజిక సంస్కర్త రావి, 1991, సెప్టెంబర్‌ 7 న తుదిశ్వాస విడిచారు.
` రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page