న్యూ దిల్లీ, అగస్టు 15 : ఆంధప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు పోలీసు అధికారులు కేంద్ర హోం శాఖ మెడల్స్ అందుకున్నారు. వీరి జాబితాను కేంద్ర హోం శాఖ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఏటా స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ ఈ పతకాలు ప్రకటిస్తుంది. పోలీస్ ట్రైనింగ్ విభాగం ఇన్స్పెక్టర్ జనరల్ పీ వెంకట్రామిరెడ్డి సేవలకు గుర్తుగా రాష్ట్రపతి పోలీస్ మెడల్ అందింది. ఏపీ నుంచి ఏఏసీ మండ్ల హరికుమార్, జేసీ ముర్రే సూర్యతేజ, జేసీ పువ్వుల సతీష్‌లకు పోలీస్ గ్యాలెంటరీ మెడల్ దక్కాయి. అలాగే, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శాంతారావు (ఎస్ఎస్జీ ఐఎస్‌డబ్ల్యూ, విజయవాడ), ఎస్ఐ వీ నారాయణమూర్తి (ఎస్ఐబీ, విజయవాడ) లకు పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలను బహూకరించారు.
ముంబై పోర్టులో సీఐఎస్ఎఫ్ విభాగం ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కేవశరావుకు 2020 ఏడాకిగాను రాష్ట్రపతి పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. అలాగే, నెల్లూరుకు చెందిన ఎన్ సుబ్బారావుకు కూడా ఇండియన్ పోలీస్ మెడల్ దక్కింది. సుబ్బారావు ప్రస్తుతం సికింద్రాబాద్ జోనల్ పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ శిక్షణ కేంద్రంలో ఇన్స్టక్ట్రగా పనిచేస్తున్నారు.