ఆర్య వైశ్యుల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక పార్టీ బిఅర్ఎస్ మాత్రమే

 

*మహేశ్వరం బిఅర్ఎస్ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 9: ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ ఆర్య వైశ్యుల అభ్యున్నతి, సంక్షేమానికి కృషి చేయడమే కాకుండా పలు పదవులు ఇచ్చి, రాజకీయంగా సముచిత స్థానం కల్పించినట్లు మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆర్య వైశ్యుల ఉన్నతికి ఏనలేని కృషి చేసిన సీఎం కేసీఆర్ కు ప్రతి ఒక్కరు అండగా నిలిచి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి విన్నవించారు. బుధవారం రాత్రి మంద మల్లమ్మ చౌరస్తా సమీపంలోని వంగ శంకరమ్మ గార్డెన్ లో బాలాపూర్ ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సబితమ్మకు ఆర్య వైశ్యులు ఘనంగా స్వాగతం పలికి, రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామని ముక్త కంఠంతో చెప్పారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్య వైశ్యుల ఉన్నతికి పెద్ద పీట వేసినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆర్య వైశ్యుల ఆత్మ గౌరవ భవనానికి స్థలం కేటాయించి, నిధులు ఇవ్వటమే కాకుండా పలు పదవులు ఇచ్చి, రాజకీయంగా సముచిత స్థానం కల్పించినట్లు చెప్పారు. ఇంత చేసినా సీఎం కేసీఆర్ కు ప్రతి ఆర్య వైశ్యుడు అండగా నిలిచి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మంత్రిగా నేను మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో పలు చోట్ల ఆర్యవైశ్యుల ఆత్మగౌరవ భవనాలకు పెద్ద ఎత్తున స్థలాలు, నిధులు ఇచ్చినట్లు చెప్పారు. జల్ పల్లిలో 500 గజాలు రూ.10 లక్షలు, కందుకూరులో 100 గజాలు రూ ల్.5 లక్షలు, మహేశ్వరంలో 400 గజాలు రూ.10 లక్షలు, బడంగ్ పేట్ లో 300 గజాలు రూ ల.10 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. బీజేపీ ఆర్య వైశ్యుల ఓట్లు తీసుకోవడమే తప్ప, వారికి చేసింది ఏమి లేదన్నారు. ఆర్య వైశ్యులను అన్ని విధాలుగా అదుకున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ అని అన్నారు. అన్ని విధాలుగా మేలు చేసిన సీఎం కేసీఆర్ కు ప్రతి ఆర్య వైశ్యుడు అండగా ఉండాలన్నారు. అగ్రకుల పేదల సంక్షేమానికి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏనలేని కృషి చేసినట్లు చెప్పారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి నియోజకవర్గంలో ఆగ్రకుల పేద పిల్లల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కొందరు మతం, కులం పేరుతో ఓట్లు వేయించుకొని, ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి అభ్యున్నతికి పాటుపడుతున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి నేతకు మనందరం అండగా ఉండి, మరోసారి సీఎం చేయాలని పిలుపు నిచ్చారు. ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, మేయర్ దుర్గా దీప్ లాల్, డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా, టూరిజం ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా, తెరిటిపల్లి శ్రీనివాస్ గుప్తా, నాలా శ్రీనివాస్ గుప్తా, చింతల రవికుమార్ గుప్తా, అర్థం లక్ష్మయ్య గుప్తా, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page