ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం

యువత ఉద్యోగాలు సృష్టించేందుకు కృషి చేయాలి
3ఐ నినాదంతో ముందుకు…ప్రధానికీ అదే విషయం చెప్పా
ఇన్నోవేషన్‌ ఇన్‌ ఇం‌జనీరింగ్‌ ‌సదస్సులో మంత్రి కెటిఆర్‌
75 ఏళ్లలో ఇంటింటికీ నీరు ఇవ్వాలన్న ఆలోచన లేదు…
రాష్ట్రపతి అయ్యాకనే ముర్ము ఊరుకు కరెంట్‌ : ‌క్వాలిటీ సర్కిల్‌ ‌ఫోరమ్‌ ‌ఫర్‌ ఇం‌డియాలో మంత్రి కెటిఆర్‌
ఉచితాలు వొద్దంటూనే ఉచిత హామీలా? : ట్విట్టర్‌ ‌వేదికగా బండి సంజయ్‌ ‌హామీలపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందిస్తుందని…ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. విద్యార్థులు ఉద్యోగాల వెంటపడకుండా ఉద్యోగాలు సృష్టించేందుకు కృషిచేయాలని మంత్రి సూచించారు. అందుకు అవసరమైన మౌలిక వసతులు, సృజనాత్మక ఆలోచనల కోసం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కేటీఆర్‌ ‌తెలిపారు. రెండున్నరేళ్ల క్రితం భారత్‌ను అభివృద్ధి పథంలో నడపాలంటే ఇన్‌‌ఫాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూజివ్‌ ‌గ్రోత్‌, ఇన్నోవేషన్‌ అనే 3 ఐ నినాదం గురించి తాను ప్రధానికి చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల నిర్వహణపై రెండున్నర ఏళ్ల క్రితం ప్రధాని నిర్వహించిన సదస్సులో తాను కీలక సూచన చేసినట్లు మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. 3 ఐ నినాదంతో భారత్‌ అభివృద్ధి సాధ్యమని ప్రధానితో చెప్పానని.. ఈ అంశంపై ఆయన కూడా ఆసక్తి కనబరిచారని చెప్పారు. 3 ఐ నినాదంలో ముఖ్యమైనది ఇన్నోవేషన్‌ అని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. కొత్త విధానాలు తీసుకురావడం కూడా ఇన్నోవేషన్‌ ‌కిందకే వొస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఇన్నోవేషన్‌ ఇన్‌ ఇం‌జినీరింగ్‌ ‌సదస్సు కార్యక్రమంలో కేటీఆర్‌ ఈ ‌వ్యాఖ్యలు చేశారు. జేఎన్‌టీయూ గోల్డెన్‌ ‌జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగుతుంది. ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా కేటీఆర్‌ అం‌దరికీ శుభాకాంక్షలు తెలిపారు. జేఎన్‌టీయూలో తనకు చాలా మంది మిత్రులున్నారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్‌ ‌నేతృత్వంలో చేపట్టిన ఇన్నోవేషన్‌ ‌కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తినిచ్చాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడినపుడు పారిశ్రామిక విధానంపై కేసీఆర్‌ ‌చర్చించారని తెలిపారు.

పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలు, ఆలోచనలు సీఎం స్వీకరించారని పేర్కొన్నారు. విద్యుత్‌, ‌పరిశ్రమలకు అనుమతుల జాప్యంపై సమస్యల గురించి వారు వెల్లడించారు. వాణిజ్య విధానాలపై బృందాన్ని పంపి అధ్యయనం చేయిస్తామని సీఎం వారికి చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేద్దామని తెలిపారు. ఆయా దేశాల్లో అనుసరిస్తున్న విధానాలతో పారిశ్రామిక విధానం తెచ్చారని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. కొద్ది నెలల వ్యవధిలోనే టీఎస్‌ఐపాస్‌ ‌విధానం అమల్లోకి తెచ్చామన్నారు. పరిశ్రమలకు ప్రభుత్వం, మున్సిపాలిటీ అనుమతులతో సంబంధం లేకుండా ఈ విధానాన్ని రూపొందించామని అన్నారు. పరిశ్రమలు తమకు తాము ధ్రువీకరణ చేసుకోవడం కూడా కొత్త విధానం అని కేటీఆర్‌ అన్నారు. కాలుష్యం, భవన నిర్మాణం, భద్రతా ప్రమాణాలపై పరిశ్రమలే ధ్రువీకరించాలని పేర్కొన్నారు. తమకు తాము ధ్రువీకరించిన మొదటి రోజు నుంచే కార్యకలాపాలు ప్రారంభించవచ్చని కేటీఆర్‌ ‌చెప్పారు. భారత్‌లో మరెక్కడా లేనివిధంగా నూతన పారిశ్రామిక విధానం తెచ్చామని తెలిపారు. దేశంలో చాలాచోట్ల సింగిల్‌ ‌విండో విధానం అమలు చేస్తున్నట్లు చెబుతారు.. సింగిల్‌ ‌విండో వెనక మరిన్ని విండోలు ఉంటాయనేది వాస్తవమని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో మాత్రం సింగిల్‌ ‌విండో విధానంలో అలా జరగదని తెలిపారు. 15 రోజుల్లో అనుమతులు రాకపోతే 16వ రోజు అనుమతి వొచ్చినట్లే భావించాలని తెలిపారు. కొత్త విధానంతో అవినీతి, అనుమతుల్ల జాప్యం నివారించగలిగామని చెప్పారు. టీఎస్‌ఐపాస్‌ ‌ద్వారా 8 ఏళ్లలో 20 వేలకు పైగా అనుమతులు ఇచ్చామని పేర్కొన్నారు. రూ.2.4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించగలిగామని అన్నారు. పరిశ్రమల ద్వారా 16 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించామని కేటీఆర్‌ ‌వెల్లడించారు.

75 ఏళ్లలో ఇంటింటికీ నీరు ఇవ్వాలన్న ఆలోచన లేదు…రాష్ట్రపతి అయ్యాకనే ముర్ము ఊరుకు కరెంట్‌ : ‌క్వాలిటీ సర్కిల్‌ ‌ఫోరమ్‌ ‌ఫర్‌ ఇం‌డియాలో మంత్రి కెటిఆర్‌
75 ‌సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంటింటికీ నీళ్లు ఇవ్వాలనే ఆలోచన ఎందుకురాలేదని మంత్రి కెటిఆర్‌ ‌ప్రశ్నించారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము వొచ్చాక వాళ్ల ఊరుకు కరెంటు వొచ్చిందని, 2022 వరకు కూడా కరెంట్‌, ‌నీళ్లు లేని ఇల్లు దేశంలో ఉండడం మన దురదృష్ట మన్నారు. క్వాలిటీ సర్కిల్‌ ‌ఫోరమ్‌ ‌ఫర్‌ ఇం‌డియా హైదరాబాద్‌ ‌చాప్టర్‌ ‌నిర్వహిస్తున్న 36వ చాప్టర్‌ ‌కన్వెన్షన్‌ ఆన్‌ ‌క్వాలిటీ కాన్సెప్టస్ ‌కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్‌, ‌వేముల ప్రశాంత్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ మనకు క్వాలిటీ అనగానే విదేశాలు గుర్తుకు వొస్తాయన్నారు. భారత్‌ అం‌టేనే శక్తివంతమైన దేశమని, 1986లో చైనా, భారత్‌ ‌రెండు దేశాల జీడీపీ ఒకేరంగా ఉండేదన్నారు. కానీ, ఇప్పుడు 5.7శాతం ఎక్కువ వృద్ధి రేటు సాధించిందన్నారు. చైనా వృద్ధి రేటు అంత పెరగడానికి మూడు కారణాలు ఉన్నాయని తెలిపారు. సింగిల్‌ ‌మైండ్‌ ‌ఫోకస్‌ ‌థింగ్స్, ‌ప్రపంచ అతిపెద్ద ఫార్మా క్లస్టర్లతో ముందుకెళ్తుందన్నారు. అద్భుతమైన క్వాలిటీ మనదగ్గర ఉందని, క్వాలిటీ తక్కువగా ఉన్న చైనా ముందుకెళ్తుందని..కానీ, క్వాలిటీ ఉన్న మనం ఎందుకు ముందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఇక్కడ కుల, మతాలు చూస్తూ వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవే మాటలతో నాలుగు వోట్లు సంపాదించుకునే ప్రయత్నం తప్ప వేరే ఆలోచన లేదన్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ..ఎనిమిదేళ్ల కిందట తెలంగాణ రాక ముందు పరిశ్రమ రంగం, తెలంగాణ వొచ్చాక, కేటీఆర్‌ ‌పరిశ్రమల మంత్రి అయ్యాక ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకోవచ్చు అన్నారు. కరెంట్‌ ‌లేక పవర్‌ ‌హాలీడేలు ఉండేవని, ఇన్‌‌ఫా•స్ట్రక్చర్‌ ‌కూడా కుదేలైందన్నారు. టీఎస్‌ ఐ ‌పాస్‌తో పరిశ్రమల అనుమతులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 24 గంటల కరెంటుతో పారిశ్రామిక రంగం ముందు కెళ్తుందని తెలిపారు. కేటీఆర్‌ ‌నాయకత్వంలో ఇన్ఫాస్ట్రక్చర్‌ ‌పెరిగిందని, కేటీఆర్‌ ‌తీసుకున్న నిర్ణయాలతో ఐటీ, ఇండస్టీ సెక్టార్లు దేశంలో మొదటి స్థానంలో నిలిచాయని ప్రశంసించారు. టీ హబ్‌ ‌ప్రపంచ స్థాయి గుర్తింపు పొంది, మొదటి స్థానంలో నిలిచిందని, టీ వర్కస్ అనే సంస్కరణ గొప్పగా సాగుతోందన్నారు.

ఉచితాలు వొద్దంటూనే ఉచిత హామీలా? : ట్విట్టర్‌ ‌వేదికగా బండి సంజయ్‌ ‌హామీలపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌
ఓ ‌వైపు ఉచిత పథకాలను వొద్దంటూనే మళ్లీ బిజెపి ఉచితాల హామీలను గుప్పిస్తుందని మంత్రి కెటిఆర్‌ ‌మండిపడ్డారు. ఇదేం విధానమని ప్రశ్నించారు. నిరుపేదలకు ఉచితంగా ఇండ్లు, విద్య, వైద్యం ఇస్తామన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ ‌ఘాటుగా స్పందించారు. బీజేపీ మూర్ఖత్వం చూస్తుంటే విచిత్రంగా ఉందని, ఉచితాలు వొద్దని ఓ పక్క విశ్వగురు ప్రధాని మోదీ చెబుతుంటే.. మరో పక్క విద్య, వైద్యం, ఇండ్లు ఫ్రీగా ఇస్తామని ఈ జోకర్‌ ఎం‌పీ హామీలుస్తున్నాడని విమర్శించారు. ఈ దేశాన్ని బీజేపీ పాలించడం లేదా అని ప్రశ్నించారు. ఉచితంగా ఇండ్లు, విద్య, వైద్యం అందిస్తామంటే మిమ్మల్ని ఎవరు ఆపారని ట్విట్టర్‌ ‌వేదికగా నిలదీశారు. తెలంగాణ బీజేపీ ఇస్తున్న ఉచిత హామీలపై పార్లమెంటులో చట్టం చేయాలని ప్రధాని మోదీని డిమాండ్‌ ‌చేశారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఉన్న పేదలకు విద్య, వైద్యం, ఇండ్లు ఉచితంగా ఇచ్చేలా చట్టాన్ని తీసుకొస్తే టీఆర్‌ఎస్‌ ‌పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page