పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 4: ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు అన్నారు. ఆశా వర్కర్ల సమ్మె 10వ రోజు పటాన్ చెరు శ్రామిక భవన్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించి, వంటా వార్పు కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేలు నిర్ణయించి,అమలు చేయాలని డిమాండ్ చేశారు.పారితోషకం వద్దని అన్నారు.ప్రస్తుతం వచ్చే 9500 వేతనం ఏ మాత్రం సరిపోవడం లేదని,నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు.2006 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం అషాలను నియమించిందని అన్నారు.18 సంవత్సరాలలో ఎలాంటి ఉద్యోగ భద్రత లేదని అన్నారు.రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్స్ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని అన్నారు. కరోనా సమయంలో ఆశాలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేశారని అన్నారు. ఇఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు ఇవ్వాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.సమ్మె డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో సమ్మెను మరింత ఉదృతం చేస్తామని అధికారులను హెచ్చరించారు.5 న జరిగే కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో గీతా,హైమావతి,వీరమాని,సరిత,లక్ష్మి,మాధవి, వనజ,నాగమణి,అరుణ,భాగ్య,అంజమ్మ, పున్యమ్మ,రాణి, గంగా, తదితరులు పాల్గొన్నారు..