పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: రాష్ట్రంలో అధిక సంఖ్యాబలం ఉన్న ముదిరాజులకు ఒక సీటు కేటాయించుకోవడం దారుణమని అభిప్రాయపడ్డారు.తెలంగాణలో 60 లక్షలు ఉన్న ముదిరాజులకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించకుండా మోసం చేసిన కెసిఆర్ పై చాలా కోపంతో రగులుతున్న ముదిరాజు బిడ్డలు,నాలుగు ఎమ్మెల్యే సీట్లు ముదిరాజ్ కార్పొరేషన్ మత్స్యశాఖ ఫెడరేషన్ తోపాటు నీలం మధు ముదిరాజ్ కు పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికైనా అధిష్టానం నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేశారు.పటాన్ చెరు టికెట్ నీలం మదుకు కేటాయిస్తే గెలిపించుకొని సీటు మీకు అప్పచెప్తామన్నారు.రాష్ట్రంలో ముదిరాజులు అందరూ ఒకటి అవుతున్నారని దీనివల్ల ఫలితాలు మారుతున్నాయని. దీని దృష్టిలో పెట్టుకొని పునాలోచించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మత్స్య శాఖ డైరెక్టర్ గ్యారల శ్రీనివాస్,ఉట్ల సుంకరబోయిన మహేష్ ముదిరాజ్,ఇంద్రేశం ముదిరాజ్ సంఘం నాయకులు బండి పురుషోత్తం,బచ్చగూడెం మత్స్యశాఖ అధ్యక్షులు విటల్, ఐలాపూర్ ముదిరాజ్ సంఘం నాయకులు గోపాల్,పెద్ద కంజర్ల నాయకులు రమేష్,ఎన్ఎంఆర్ యువసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.